
ఎగ్జిబిటర్లకు… డిస్ట్రిబూటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పర్సంటేజ్‌కి ఓకే చెప్పకుంటే… తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సౌత్ ఎగ్జిబిటర్లు… ఇవాళ మరోసారి బెంగళూరులో సమావేశమవ్వడం చర్చనీయాంశమైంది. పాత వాటితో పాటు మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం… ఆ నిర్ణయాలు నిర్మాతలపై పట్టు బిగించేలా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే మినిమమ్ 8 వారాల గడువు ఉండాల్సిందేనంటున్నారు ఎగ్జిబిటర్లు. సినిమా హిట్ అండ్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా 8 వారాల తర్వాతే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసుకోవాలంటున్నారు. సినిమా థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వస్తే తాము నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్సంటేజ్ వ్యవహరంపైనా మరోసారి చర్చించారు. థియేటర్లతో రెంటల్ సిస్టమ్ రద్దు చేయాలన్నారు. ఎంతశాతం పర్సంటేజ్ అనేది త్వరలోనే మరో మీటింగ్ నిర్వహించి నిర్ణయిస్తామంటున్నారు ఎగ్జిబిటర్లు.
వాయిస్ః మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ థియేటర్స్‌కి కూడా వసూళ్లలో పర్సంటేజీ ఇవ్వాలనేది ఎగ్జిబిటర్ల ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్. అయితే… అద్దె ప్రాతిపదిక ద్వారా తమకి ఆదాయం ఉండడం లేదని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అయితే మున్ముందు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కి ఉండటం… ఎగ్జిబిటర్లు వరుస మీటింగులు పెట్టి పర్సంటేజ్‌ల వ్యవహారంపై తెగ చర్చిస్తుండటం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. వీళ్ల నిర్ణయాలపై ఇటు నిర్మాతలు, అటు ఓటీటీ సంస్థల అధినేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
