
Varun Chakravarthys Viral Tea Cup Troll: భారత జట్టు 2026 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై అద్భుత విజయాన్ని సాధించింది.
నిన్న ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును సాధించింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల అద్భుత ప్రదర్శన జట్టుకు ఈ ఘనతను చేకూర్చింది. అనంతరం, న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగి కేవలం 159 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
ఈ విజయంతో, భారత్ మూడోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్‌లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 14 వికెట్లు తీసి జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకర్‍గా నిలిచాడు.
టీమిండియా ఈ విజయ సంబరాల్లో మునిగి తేలుతుండగా, వరుణ్ చక్రవర్తి మరోసారి పాకిస్తాన్‌పై తనదైన శైలిలో సరదా ట్రోల్‌ను కొనసాగించాడు.
చక్రవర్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫన్నీ ఫోటోను పోస్ట్ చేశాడు. అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో అతను ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఒక చేత్తో పట్టుకుని, మరొక చేత్తో టీ కప్పులో టీ తాగుతూ కనిపించాడు.
ఈ పోస్ట్ అభిమానులకు తెగ నచ్చేసింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు, పోస్ట్‌లతో దీనికి ప్రతిస్పందిస్తున్నారు.
View this post on Instagram
ఈ “టీ కప్పు” ప్రస్తావన ఒక పాత సంఘటనకు సంబంధించినది. 2025 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై ఫైనల్‌లో టీమిండియా గెలిచిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నక్వి నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. ఆ సమయంలో, వరుణ్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఆసియా కప్ ముగిసిన తర్వాత నా పక్కన కేవలం కాఫీ కప్పు మాత్రమే ఉంది. కాబట్టి, ఆ ఫోటో కోసం ఇదే ఉపయోగించాను” అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, చక్రవర్తి అదే “టీ కప్పు” థీమ్‌ను కొనసాగిస్తూ పాకిస్తాన్‌ను ట్రోల్ చేశాడు. వరుణ్ చక్రవర్తి పోస్ట్‌కు నెటిజన్లు “వాళ్ళు చేసిన మోసం ఇప్పుడు వాళ్లే అనుభవిస్తున్నారు” వంటి కామెంట్లతో స్పందిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(@brightside.of.bharat)