నంగర్హార్-ఖైబర్ తోర్ఖం సరిహద్దుపై ఆఫ్ఘన్ సైన్యం తన పట్టును బలోపేతం చేసుకుంది. మంగళవారం (మార్చి 03) తెల్లవారుజామున డ్యూరాండ్ లైన్ దాటి ఏడు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది . అక్కడ ఉన్న సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఆఫ్ఘన్ సైన్యం 205వ అల్ బదర్ కార్ప్స్ ప్రత్యేక బలగాలను తోర్ఖం సరిహద్దుకు పంపింది. ఒకవైపు ఈ దళాలు తోర్ఖం సరిహద్దు సమీపంలోని కొండపై ఉన్న పాకిస్తానీ పోస్టులను ధ్వంసం చేస్తుండగా, మరోవైపు, పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ తోర్ఖం సరిహద్దు ద్వారం వద్ద ఆఫ్ఘన్ సైన్యానికి చెందిన 100 మందికి పైగా సాయుధ సైనికులతో పోరాడుతోంది. పాకిస్తాన్ సైనికులను చూడగానే వారిని లక్ష్యంగా చేసుకున్నారు.
ఒకవైపు, ఆఫ్ఘన్ సైన్యం తోర్ఖం సరిహద్దు సమీపంలోని లాండి కోటల్ సెక్టార్‌లోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ఫిరంగి, రాకెట్ లాంచర్ షెల్స్‌తో కాల్చి ధ్వంసం చేయగా, మరోవైపు, ఉదయం 10:30 గంటల ప్రాంతంలో తోర్ఖం సరిహద్దు గేటు వద్ద నిలబడి ఉన్న ఒక పాకిస్తాన్ ఆర్మీ సైనికుడిని ఆఫ్ఘన్ ఆర్మీ స్నిపర్ చంపేశారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని తోర్ఖం ప్రాంతం అత్యంత కీలకమైంది. పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆర్థిక వాణిజ్యం కూడా జరిగే అతి ముఖ్యమైన సరిహద్దు. ఈ ప్రదేశంలో పాకిస్తాన్ సైన్యం పెద్ద సంఖ్యలో ఉంది. కానీ గత 7 రోజుల్లో ఆఫ్ఘన్ సైనికులు పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి వెళ్ళమని బలవంతం చేశారు. సమాచారం ప్రకారం పాకిస్తాన్ సైనికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తోర్ఖం గేట్ నుండి 6 కి.మీ దూరం వెళ్ళారని సమారం.
ఇదిలావుంటే, మంగళవారం, ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ తరపున రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ సైనిక నియంత్రణలో ఉన్న భూభాగంలో ఎనిమిది భద్రతా పోస్టులను ఆఫ్ఘన్ సైన్యం స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ ప్రతినిధి సెదికుల్లా నుస్రత్ తెలిపారు. వీటిలో కాందహార్‌లో ఐదు, ఖోస్ట్‌లో రెండు, జాబుల్లో ఒకటి ఉన్నాయి. రెండు వైపులా ఘర్షణలు కొనసాగుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
