తాజావార్తలు

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే.. రైతు చేసిన పనికి అంతా ఉరుకులు పరుగుుల..!

అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే.. రైతు చేసిన పనికి అంతా ఉరుకులు పరుగుుల..!


ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారుల తీరుపై ఓ రైతు మండిపడ్డాడు. తన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ సొంత ట్రాక్టర్‌ను నిప్పు పెట్టుకున్నాడు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం ఎదురుగా ఈ ఘటన జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో అక్కడ అలజడి రేగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చివరికి ఫైరింజన్‌ను రప్పించిన పోలీసులు మంటలార్పించారు.

కర్నూలు ఆర్టీవో కిశోర్ తన సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఎండుగడ్డితో వస్తున్న ట్రాక్టర్లను ఆపి తనిఖీ చేశారు. అయితే, ఏం జరిగిందో ఏమో.. ఆవేశానికి లోనైన రైతు.. సడన్‌గా ఎండుగడ్డికి నిప్పుపెట్టాడు. RTO అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గడ్డితోపాటు ట్రాక్టర్‌కి నిప్పుపెట్టడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఊహించని పరిణామంతో.. తేరుకున్న RTO సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

అయితే, అప్పటికే మంటలు అంటుకుని సగానికి పైగా ఎండుగట్టి తగలబడిపోయింది. తగలబడుతోన్న ఎండుగట్టి రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడటంతో అక్కడ అలజడి రేగింది. చివరికి ఫైరింజన్‌ను రప్పించి మంటలార్పించారు పోలీసులు. అనంతరం, రైతును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *