తాజావార్తలు

Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?

Kishan Reddy : రాహుల్ గాంధీ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే?


పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రతి పార్లమెంట్ సమావేశానికి ముందు రాహుల్ గాంధీ అతని అంతర్జాతీయ సహచరులు ఏవో తప్పుడు వార్తలను క్రియేట్ చేసి వారికి అనుకూలమైన పత్రికల్లో వేసి.. తర్వాత వాటిని తమకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా పార్లమెంట్‌ జరగకుండా అడ్డుకుంటారని మండిపడ్డారు.

గత కొన్ని పార్లమెంటు సమావేశాలుగా రాహుల్ చేస్తున్న ప్రతి పనిని దేశ ప్రజలు గ్రహించగలిగారని.. భారతదేశం అభివృద్ధి చెందడాన్ని అతను ఇష్టపడట్లేదన్నారు. అంతేకాదు బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని అతను జీర్ణించుకోలేకపోతున్నాడని ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారని అన్నారు. రాహుల్ గాంధీ నిత్యం చైనా, పాకిస్తాన్ ఎజెండాలను ప్రచారం చేస్తున్నారని.. దీన్ని బట్టి చూస్తే అతను తీవ్రంగా రాజీపడ్డాడని అందరికీ తెలుస్తుందన్నారు. అందుకే దేశ ప్రజలు అందరూ తనను తిరస్కరిస్తున్నారనే వాస్తవాన్ని ఆయన అంగీకరించలేక, కాంగ్రెస్ పార్టీని గూండాల పార్టీగా మార్చేశాడని ఆరోపించాడు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని దేశ ప్రధాని ముగించడం ఒక అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సంవత్సరం ప్రధాని మోదీ ప్రసంగంలో ఇటీవల ముగిసిన యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చలలో సాధించిన విజయం, అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో పురోగతి, ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌తో సహా అనేక అంశాలు ఉండేవి. రాహుల్ గాంధీ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రధానిని పార్లమెంట్‌లో మాట్లాడకుండా ఆపాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమైందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *