టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పంజాబీ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ‘లక్కీ ఛామ్’గా మారిపోయింది. కేవలం టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ విజయ్ దళపతి సరసన నటించి అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆచి తూచి సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. కాగా గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో.. “ఒకవేళ మీరు సినీ పరిశ్రమకు చెందిన ఏ హీరోతోనైనా ‘మూవీ డేట్’ (సినిమాకు వెళ్లడం) కి వెళ్లాల్సి వస్తే.. ఎవరిని ఎంచుకుంటారు?” అని యాంకర్ అడగ్గా ఆసక్తికర సమాధానం చెప్పింది.
ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే
ఆ ప్రశ్నకు మీనాక్షి ఏమాత్రం తడుముకోకుండా, ఎంతో ఉత్సాహంగా కోలీవుడ్ స్టార్ హీరో శింబు పేరును చెప్పింది. “నేను మూవీ డేట్‌కు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా శింబు సార్‌తోనే వెళ్తాను” అంటూ చాలా ఎగ్జైటింగ్‌గా సమాధానం ఇచ్చింది. శింబు స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన నటన అంటే తనకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ పేర్కొంది. శింబుపై మీనాక్షి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఓయమ్మో..! ఓరినాయనో..!! ఇవెక్కడి హారర్ సిరీస్‌లు రా అయ్యా.! చూస్తే నిద్రపట్టదు
గతంలో శింబు, మీనాక్షి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ దీని పై ఇద్దరూ స్పందించలేదు. అయితే ఇప్పుడు శింబుతోమూవీ డేట్కువెళ్తా అని మీనాక్షి చెప్పడంతో ఫ్యాన్స్ అవాక్అవుతున్నారు . ముఖ్యంగా శింబు అభిమానులు ఈ వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తూ, ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం… దర్శకుడు అశ్వత్ మరిముత్తు నేతృత్వంలో శింబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘STR 49’ లో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది.
10లక్షలకే ఇస్తా అన్నారు.. రాళ్లు రప్పలు ఉన్నాయని ఆ భూమి కొనలేదు.. ఇప్పుడు వందలకోట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
