తాజావార్తలు

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!


ఒక్క రోజు వేడుక, కొన్ని గంటల హంగామా కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే అంశంపై బెంగళూరుకు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “కేవలం బంధువులను మెప్పించడం కోసం పెళ్లికి రూ.20 లక్షలు ఖర్చు చేయకండి” అని ఆమె నెటిజన్లకు హితవు పలికారు. పెళ్లి బడ్జెట్‌ను క్షుణ్ణంగా విశ్లేషిస్తూ.. ఆహారం, డెకరేషన్, వెన్యూ, ఫొటోగ్రఫీ పేరుతో లక్షలాది రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారని మీనల్ పేర్కొన్నారు. “పెళ్లి జరిగిన 48 గంటల్లోనే వేదిక ఖాళీ అవుతుంది, డెకరేషన్లు తొలగిపోతాయి, వంటకాలూ పూర్తవుతాయి. వచ్చిన అతిథులు తర్వాతి పెళ్లికి వెళ్ళిపోతారు. కానీ, చివరికి ఆ కుటుంబానికి మిగిలేది మాత్రం తీర్చలేని అప్పుల భారమే” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్భాటపు ఖర్చులకు బదులుగా ఆ మొత్తాన్ని సొంతింటి కొనుగోలుకు డౌన్ పేమెంట్‌గా, పిల్లల చదువులకు లేదా అత్యవసర నిధిగా పొదుపు చేసుకుంటే భవిష్యత్తుకు ఆర్థిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. కాగా, ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవితంలో ఒక్కసారే వచ్చే వేడుకలో నచ్చినట్లు ఖర్చు చేయడంలో తప్పులేదని కొందరు సమర్థిస్తుంటే.. మధ్యతరగతి కుటుంబాలకు ఇది కనువిప్పు లాంటి సలహా అని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *