ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక డిమాండ్‌పై అనిశ్చితి కారణంగా, పెట్టుబడిదారులు వెండిలో కొత్తగా కొనుగోళ్లు చేయడానికి వెనుకాడారు. ఈనెల 5వ తేదీన దేశంలో వెండి ధర 2.50,000 రూపాయల వరకు ఉండగా, ప్రస్తుతం 2.30,000 వరకు దిగి వచ్చింది. అంటే 20 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే గత నెల జూన్ 1వ తేదీన కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ట్రేడయ్యింది. అంటే గత నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు వెండి ధరను పరిశీలిస్తే కిలోపై ఏకంగా 50 వేల రూపాయల వరకు తగ్గిందనే చెప్పాలి.
