తదుపరి దశలో, పిండి పెట్టుకున్న మీల్ మేకర్‌ను మ్యారినేట్ చేయాలి. ఇందుకోసం మీల్ మేకర్లో కొద్దిగా పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. మరోవైపు 600 గ్రాముల బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంట పాత్రలో లేదా కుండలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు, ఇలాచీ, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు వంటి హోల్ గరం మసాలా దినుసులు వేయాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
