Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్..
గత ఏడాది చివర్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సందడిగా గ్రామాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్ధానంలో బీజేపీ నిలిచాయి. కొత్త సర్పంచ్‌లు కూడా అన్ని గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో గ్రామాల్లో పరిపాలన మరింతగా పుంజుకుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ,…
