600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు!
రష్యాలో చరిత్రకారులను సైతం ఆశ్చర్యపరిచే ఒక ఆవిష్కరణ జరిగింది. రష్యా చరిత్రలోనే అత్యంత అరుదైన, భారీ పురావస్తు నిధి మాస్కో పరిసర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల కిందట నేలలో దాచిన ఒక పురాతన బంకమట్టి బిందెలో ఏకంగా 2,600కి పైగా అరుదైన వెండి నాణేలు లభించినట్లు పురావస్తు పరిశోధకులు వెల్లడించారు. ఈ నిధి లభించడం వల్ల 600 ఏళ్ల నాటి రష్యా ఆర్థిక వ్యవస్థ, వర్తక రహస్యాలు వెలుగులోకి రానున్నాయి. 14వ శతాబ్దపు నాణేల ప్రత్యేకత:…
