యువతలోనే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ.. ఎందుకో తెలుసా? నిపుణుల మాట ఇదే
ఇటీవల కాలంలో చాలా మంది యువత బ్రెయిన్ స్ట్రోక్‌కు బారినపడుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నవారిలో 25 శాతం యువతే ఉండటం గమనార్హం. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడేనని అంటున్నారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం.. ఒకే సంవత్సరంలో దేశంలో 18 లక్షలకుపైగా స్ట్రోక్ కేసులు నమోదయ్యాయి. గత దశాబ్దంలో ఈ…
