కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఇటీవలే ‘పెద్ది’ సినిమాలో కనిపించింది. ‘హల్లల్లో హల్లో’ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిందులేసింది. జూన్ 04న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఓవరాల్ గా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అలాగే ఈ సినిమాలో శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్ కు కూడా మంచి పేరొచ్చింది. కాగా ఈ ముద్దుగుమ్మ చివరిగా రజనీకాంత్ కూలీ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించింది. ప్రస్తుతం శ్రుతి చేతిలో దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార సినిమాతో పాటు సలార్ 2, ట్రైన్ అనే క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే టైమ్ కుదిరినప్పుడల్లా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తుంటుంది. అలా తాజాగా అభిమానులతో ఆస్క్ మీ ఎనిథింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ సెషన్ నిర్వహించింది శ్రుతి హాసన్. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిచ్చింది.
ఇవి కూడా చదవండి
ఈ ఛాట్ సెషన్ లో భాగంగా ఓ నెటిజన్ శ్రుతి హాసన్ ను ఆసక్తికర ప్రశ్న అడిగింది. మీరు బొడ్డుకు పియర్సింగ్ ఉందా?.. ఎప్పుడు చేయించుకున్నారు అని అడిగింది ఓ నెటిజన్. దీనికి శృతిహాసన్ కూడా సమాధానం ఇచ్చింది. ‘ 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బొడ్డుకు పియర్సింగ్ చేయించుకున్నాను అని ఆన్సర్ ఇచ్చింది. అయితే ఈ విషయం తెలిసి నాన్న నాపై చాలా కోప్పడ్డారని కూడా శ్రుత అప్పటి విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇదే క్రమంలో తన జుట్టు సంరక్షణ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు నెటిజన్లతో పంచుకుంది శ్రుతి హాసన్. జుట్టు సంరక్షణ, స్టైలింగ్ కోసం తరచుగా సెలూన్‌లకు వెళ్తారని అడిగిన ప్రశ్నకు.. ‘నేను ఐదేళ్లుగా హెయిర్ సెలూన్‌కు వెళ్లలేదు. చివరిసారిగా నా జుట్టుకు 2017లో రంగు వేసుకున్నాను. నా జుట్టును నేనే కత్తిరించుకుంటా. నేనే ట్రీట్మెంట్ చేసుకుంటాను. తరచుగా సెలూన్‌లకు వెళ్లడంపై ఆధారపడటం కంటే నా జుట్టు సంరక్షణను నేనే చూసుకోవడానికి ఇష్టపడతాను’ అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
తండ్రి కమల్ హాసన్ తో శ్రుతి హాసన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
