తాజావార్తలు

నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..

నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన లవర్స్.. ఏకాంతంగా ఉండగా ఒక్కసారిగా చుట్టుముట్టి.. ఆ తర్వాత..


ఏకాంతంగా ఉన్న జంటను బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.. వారిని ఫోటోలు తీసి బంగారం, జేబులోని డబ్బు దర్జాగా దోచుకునే ముఠాగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు బ్లేడ్ బ్యాచ్ ను అరెస్ట్ చేసిన వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు. వరంగల్ లో మిల్స్ కాలనీ PS పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను ఈ ముఠా టార్గెట్ చేసింది.. వారిని ఫోటోలు, వీడియోలు తీసి భయభ్రాంతులకు గురిచేసి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలను బలవంతంగా లాక్కొని, యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేశారు.

పవన్ సింగ్, రవీందర్ సింగ్, సికెందర్ సింగ్ అనే ముగ్గురు ఆకతాయిలు కొత్త తరహా నేరాలకు తెరలేపారు.. మద్యం సేవించడానికి డబ్బులు లేకపోవడంతో, నిర్మానుష్య ప్రదేశాల్లో వెళ్లే వారిని బెదిరించి డబ్బులు గుంజుకోవాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ఉర్సుగుట్ట – బట్టుపల్లి రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో వేచి చూస్తున్నారు. ఆ మార్గంలో వెళ్తున్న ఓ యువకుడు, యువతి మోటార్ సైకిల్‌పై వచ్చి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఒక వెంచర్‌లోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. వారు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి నిందితులు ముగ్గురూ అక్కడికి చేరుకొని, ఏకాంతంగా ఉన్న ఆ జంటను చుట్టుముట్టారు.

వారి సెల్‌ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసి.. వీటిని మీ తల్లిదండ్రులకు పంపుతాం, మీడియాలో పెడతాం అని బెదిరిస్తూ బ్లాక్‌ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. బాధితులు తమ వద్ద నగదు లేదని చెప్పగా, నిందితులు ఆ యువకుడిని చేతులతో విచక్షణారహితంగా కొట్టారు. బాధితుడు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపుతానని బ్రతిమిలాడినప్పటికీ, ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే పోలీసులకు దొరికిపోతామని భావించిన నిందితులు దానికి నిరాకరించారు.. ఆ తర్వాత నిందితుడు పవన్ సింగ్ సదరు యువతి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని బలవంతంగా లాక్కోగా, రవీందర్ సింగ్ ఆ యువకుడి చేతికి ఉన్న వెండి ఉంగరాన్ని లాక్కున్నాడు. ఇదే క్రమంలో సికెందర్ సింగ్ యువతి పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు.

అనంతరం బాధితుల ముందే ఆ వీడియోలను డిలీట్ చేసినట్లు నటించి, అక్కడి నుండి పరారయ్యారు.. దోచుకున్న ఉంగరాలను కాజీపేటలో అమ్మితే పోలీసులకు దొరికిపోతామనే భయంతో, నిందితులు ముగ్గురూ వాటిని వరంగల్‌ లో విక్రయించేందుకు మోటార్ సైకిల్‌పై వస్తుండగా పక్కా వ్యూహంతో నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుండి క్రింది సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *