తాజావార్తలు

రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20 డబుల్ సెంచరీ.. కొట్టింది ఎవరో కాదు మనోడే

రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20 డబుల్ సెంచరీ.. కొట్టింది ఎవరో కాదు మనోడే


రోహిత్, కోహ్లీకే సాధ్యం కాలేదు.. 17 ఫోర్లు, 17 సిక్సర్లతో టీ20 డబుల్ సెంచరీ.. కొట్టింది ఎవరో కాదు మనోడే

ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అజేయంగా డబుల్ సెంచరీ సాధించి, ఈ ఫార్మాట్‌లో 200 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. సుబోధ్ భాటి కేవలం 79 బంతుల్లో 205 పరుగులు చేశాడు, ఇందులో 17 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. అతని బ్యాటింగ్‌లో 34 బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల సహాయంతో 170 పరుగులు చేయడం విశేషం, ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 259గా నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే..! ఢిల్లీ ఎలెవెన్ జట్టు తరపున ఆడుతున్న సుబోధ్ భాటి, ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 256 పరుగులు చేసింది. సుబోధ్ భాటితో పాటు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సింబా జట్టు 18 ఓవర్లలో 199 పరుగులు మాత్రమే చేయగలిగి, 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకుముందు 2007లో శ్రీలంకకు చెందిన ధనుకా పతిరానా లాంచైర్ సాండీవిర్త్ లీగ్‌లో 72 బంతుల్లో 277 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ ప్లేయర్ కార్న్ వాల్(205), సాగర్ కులకర్ణి(219) పొట్టి ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం ఇప్పటిదాకా ఏ ఒక్క ప్లేయర్ కూడా డబుల్ సెంచరీ సాధించలేదు.

ఇది చదవండి: టెస్ట్ క్రికెట్‌ను వన్డేల్లా ఆడిన మొనగాళ్లు వీరే.. లిస్టులో నెంబర్‌వన్ టీమిండియా కింగ్

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *