తాజావార్తలు

Tollywood : సూర్యకాంతం చనిపోతే చూడటానికి ఎవరూ వెళ్లలేదు.. కారణం ఇదే.. నటుడు మురళీమోహన్..

Tollywood : సూర్యకాంతం చనిపోతే చూడటానికి ఎవరూ వెళ్లలేదు.. కారణం ఇదే.. నటుడు మురళీమోహన్..


Tollywood : సూర్యకాంతం చనిపోతే చూడటానికి ఎవరూ వెళ్లలేదు.. కారణం ఇదే.. నటుడు మురళీమోహన్..

నటుడు మురళి మోహన్ ఒక తాజా ఇంటర్వ్యూలో తెలుగు సినీ చరిత్రలోని కొన్ని ఆణిముత్యాలైన చిత్రాల గురించి, వాటిలోని పాత్రల ప్రభావం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “గుండమ్మ కథ” సినిమా టైటిల్ ఎంపిక వెనుక ఉన్న కథను ఆయన వివరించారు. విజయవాహిని స్టూడియో వారు సినిమాను సబ్జెక్ట్ చేసినప్పుడు టైటిల్ ఇంకా ఖరారు కాలేదని, సాధారణంగా సినిమాలు హీరోలు, హీరోయిన్లు లేదా కుటుంబం పేర్లతో వస్తాయని తెలిపారు. అయితే, ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి వంటి మహానటులు ఉన్న ఆ సినిమాకు, చక్రపాణి గారు “గుండమ్మ కథ” అనే పేరు పెట్టాలని సూచించారట. కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, చక్రపాణి గారు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, ఈ సినిమాకు అదే సరైన పేరు అని, దీని విజయాన్ని చూడమని అన్నారు. అనూహ్యంగా, ఆ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్‌తో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు, జూనియర్ ఎన్.టి.ఆర్, నాగ చైతన్య వంటి నటులను తీసుకోవాలని అనుకున్నప్పటికీ, “గుండమ్మ” పాత్రను ఎవరు పోషిస్తారనే ప్రశ్న వచ్చిందని.. అక్కినేని సైతం “గుండమ్మ ఎవరు వేయాలి?” అని ప్రశ్నించారట. సూర్యకాంతం లాగా ఆ పాత్రను పోషించే స్తోమత ఎవరికీ లేదని, ఎంత బాగా చేయించినా “ఆమె సూర్యకాంతం గారిలా లేదు” అనే విమర్శలు వస్తాయని, అది సినిమాకు దెబ్బ కొడుతుందని మురళి మోహన్ అన్నారు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు వంటి వారి పాత్రలను చేయగల వారు ఉండవచ్చు కానీ, సూర్యకాంతం పాత్రను ఎవరూ రీప్లేస్ చేయలేరని, ఆ సినిమాకు ఆవిడే హీరో అని ఆయన స్పష్టం చేశారు.

సూర్యకాంతం తన పాత్రల్లో ఎంతగా జీవించేవారంటే, ఆమె పేరు వింటేనే గయ్యాళి అత్త అనే భావన కలిగేది. దీనివల్ల గత 70 ఏళ్లలో తెలుగు వారు తమ పిల్లలకు ‘సూర్యకాంతం’ అనే పేరు పెట్టడమే మానేశారని ఆయన గుర్తు చేశారు. కానీ తెర వెనుక ఆమె మనసు వెన్న. షూటింగ్‌లో ఎవరినైనా క్యారెక్టర్ ప్రకారం తిట్టినా లేదా కొట్టినా, సీన్ పూర్తయిన వెంటనే వారి దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరుతూ కన్నీళ్లు పెట్టుకునేవారట. అంతేకాకుండా, ఆమె షూటింగ్‌కు వచ్చేటప్పుడు ఎప్పుడూ ఒట్టి చేతులతో రాకుండా, పులిహోర వంటి పదార్థాలను స్వయంగా వండి సెట్‌లోని అందరికీ ప్రేమగా వడ్డించేవారని ఆయన పేర్కొన్నారు

సూర్యకాంతం మరణం తర్వాత పరిశ్రమ వ్యవహరించిన తీరుపై మురళీ మోహన్ విచారం వ్యక్తం చేశారు. 1994లో ఆమె మరణించినప్పుడు కనీసం పది మంది సినిమా వారు కూడా అంత్యక్రియలకు వెళ్లలేదని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వాలు ఆమెకు పద్మశ్రీ వంటి పురస్కారాలతో తగిన గుర్తింపు ఇవ్వలేదని, కనీసం ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *