తాజావార్తలు

సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!


సొంతింటి కోసం ఎదురుచూసేవారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఈ నెల 17న 2,064 ఇళ్ల పంపిణీ!

ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది. ఇందులొ భాగంగానే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను మొదటు పెట్టింది. ప్రజలకు చెప్పినట్టుగానే ఉగాది నాటికి ఈ ఇళ్లను పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి.. ప్రజలకు అందించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే అక్కడ పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసింది ప్రభుత్వం. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటకు సమీపంలో బిరదవాడ వద్ద నెషనల్ హైవే 16 పక్కన 36 ఎకరాల విస్తీర్ణంలో రూ.168 కోట్లతో 2,064 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం సకల వసతులతో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉగాదికి ముందు ఈ నెల 17న సీఎం చేతుల మీదగా ఈ ఇళ్లను ప్రారంభించనుంది.

అయితే గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెవర్చేందుకు నాయుడుపేట పురపాలక సంఘం బిరదవాడలో 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2064 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను చేపట్టింది. దాదాపు 70 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అప్పుడే సరిగ్గా ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో వాటి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వీటి నిర్మాణ పనులు పూర్తి చేయలేదు.

తాజాగా మళ్లీ బీజేపీ, జనసేన కూటమిగా కలిసి అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని మళ్లీ చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసి ఆ ఇళ్లను సుందరంగా తీర్చి దిద్దింది. ఇక ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు చేతుల మీదగా వాటిని ప్రారంభించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *