ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం
మనమీద మనకు గాఢమైన నమ్మకాన్ని కలిగి వుండటమే ఆత్మ విశ్వాసం. నేటి యువతలో చాలామందికి తమలో తమకు ఆత్మవిశ్వాసం వుండకపోవడం మనం గమనిస్తున్నాం.

నిజానికి కాళ్ళు, చేతులు సక్రమంగా వుండి ఏ పని చేయడానికి ఆసక్తి చూపని వాడే వికలాంగుడు. అంతేకాని శరీరంలో ఒక భాగం పోయినా మిగిలిన భాగాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్న వ్యక్తి వికలాంగుడు కాడు.
ముప్ఫై మూడేళ్ళకే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్లో https://studio.youtube.com/video/jICJLH8uJSg/editవున్నది అంతులేని ఆత్మ విశ్వాసం. యుద్ధోన్మాదంతో జపాన్ మీద రెండు బాంబులు జారవిడిచింది అమెరికా 50 సం॥రాల క్రితం.
అయినా ఆ బూడిద మీదే ఆ దేశం జూలు విదిల్చిన సింహంలా నిద్రలేచి అమెరికా పారిశ్రామిక వ్యవస్థనే సవాలు చేయడానికి కారణం ఆ దేశ యువత ఆత్మవిశ్వాసం.
మరో అద్భుత కథని తెలుసుకుందాం!
ఆమెకి చిన్నప్పుడు కనీసం తినడానికి తిండికూడ లేదు. నిజానికి ఆమె ఇంటికి తలుపులు లేవు. గాలి రాదు. కరెంటు లేదు. గ్యాస్ లేదు.
తనకు దొరికిన చాలా తక్కువ ఆహారాన్ని తిని ఆకలికి తాళలేక స్పృహ తప్పిపోయేది కొన్నిసార్లు.
అలాంటి ఆమె ఎలాగైనా ఈ ప్రపంచంలో నెంబర్వన్ సైంటిస్ట్ గా ఎదగాలనుకుంది. ఫలితంగా అంతులేని ఆత్మవిశ్వాసంతో కృషి చేసి నోబుల్ ప్రైజ్ని సంపాదించింది.
ఆమె…. మేడమ్ క్యూరి. రేడియం కనిపెట్టి మెడికల్ సైన్స్ రూపురేఖలనే మార్చివేసింది. చీకటి గదిలో తిండిలేక స్పృహ తప్పిపోయిన ఓ బాలిక… నేడు… చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ గొప్ప సైంటిస్ట్. ఆమె సక్సెస్కి కారణం… అంతులేని ఆత్మ విశ్వాసం. https://studio.youtube.com/video/bLWI6vkghAU/edit
ఎలాగైనా పైకి రావాలన్న తాపత్రయం. తనమీద తనకే నమ్మకం. తుదకు ఆమె ఆశయం హృదయంలో నిరంతర తపనలో కరిగి ఆమె కలని నిజం చేసింది.

మనలో ఒక్క పూట గ్యాస్ అయిపోతే ‘అబ్బో! ఈ పూట నాకెంత కష్టం వచ్చింది అని బాధపడిపోయే వారు ఆమె జీవితం నుండి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది.
ఆత్మ విశ్వాసానికి మారుపేరు మరొక గొప్ప వ్యక్తి వున్నారు. అతడే అమెరికాని కనిపెట్టిన కొలంబస్.https://studio.youtube.com/video/meZuKOAUX3k/edit
తన భార్య వద్దన్నా, ఇంట్లో పడి వుండమన్నా ప్రపంచంలో ఏదోఒకటి కనిపెట్టాలన్న ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో సుడులు తిరిగే సముద్రంలో ఎన్నో రాత్రులు, పగలు అన్వేషించాడు.
తన సముద్రయానంలో ఎన్నో నిరాశలు ఎదురైనా అంతులేని ఆత్మవిశ్వాసంతో అన్వేషణ కొనసాగించాడు. దాని ఫలితంగా అతడి వెంట్రుకలు తెల్లబడ్డాయి.
అతడి బట్టలు చినికి పీలికలైపోవడమే కాక అతడికి కీళ్ళవాతం వచ్చింది.
తుదకు ఆత్మవిశ్వాసంతో అమెరికా కనిపెట్టాడు. నాడు అతడు కొలంబస్ కనిపెట్టిన నౌకాయానం ద్వారా అనేక దేశాల ప్రజలు తమ ఎగుమతులు, దిగుమతులు కొనసాగించి తమ జీవితాలను సుఖవంతం చేసుకున్నారు.

ఎక్కువమందిలో ఆత్మవిశ్వాసం లేకపోవడానికి కారణం
ఎక్కువమందిలో ఆత్మవిశ్వాసం లేకపోవడానికి కారణం తమమీద తమకు నమ్మకం లేకపోవడమే! ‘నాకు బాగోలేదు’, ‘నేను చేయలేను’, ‘నాకు ఈ ఉద్యోగం అంటే అసహ్యం’, ‘నాకు అంత తెలివి తేటలు లేవు’, ‘నాకు అదృష్టం లేదు‘, ‘నేను మొహమాటస్థుడిని‘, ‘నాకు ఆసక్తి లేదు‘ ఇవన్నీ ఆత్మన్యూనతని సూచించే అంశాలు.https://studio.youtube.com/video/SXUQ46GH01A/edit
వీటినే మీరు ‘నేను చేయగలను’ ‘నేను భయపడను” ‘నాకు ఆత్మ విశ్వాసం ఎక్కువ’ ‘ఇతరుల విజయానికి నేను చేతులెత్తి నమస్కరిస్తాను.’ ‘నా జాబ్ అంటే నాకు ఆసక్తి ఎక్కువ’ అంటూ పాజిటివ్ ఆలోచనల్ని మార్చుకుంటే మీలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే-
అత్యంత ముఖ్యంగా
1.{మొదటగా }…ముందుగా మీ జీవిత గమ్యం ఏమిటో స్పష్టంగా నిర్ధారించుకోవాలి.
2.ఆ లక్ష్యాన్ని నేను తప్పక సాధించగలను’ అని మీరు నమ్మకం కలిగి వుండాలి. మిమ్మల్ని మీరు కించపరచుకోవడం మానెయ్యండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచెనా వేసుకుంటే ఆత్మన్యూనతకి దారితీస్తుంది
3.భగవంతుడు అందరికి ఇచ్చినట్లుగా నాకు రెండు చేతులు, రెండు కాళ్ళు ఇచ్చాడు. అవి చాలు నా లక్ష్యానికి అని మీరు పాజిటివ్ గా ఆలోచించగలగాలి.
4.మీరు చేసిన తప్పులను గురించి మర్చిపోండి. తప్పులు అందరూ చేస్తారు. తప్పులు చేయనివారు లేరు. ఆ తప్పుల తాలూకు అనుభవాలు నుండి పాఠాలు నేర్చుకోండి.
5.మీరు ఇంతకుముందే సాధించిన విజయాల జ్ఞాపకాలను భద్రపరచండి. ఆ విజయాల పరంపర నుండి మీకు ఉత్సాహం ద్విగుణీకృతమవుతుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
6.ముందుగా చిన్న పనులతో మొదలు పెట్టండి. వాటిని క్రమంగా పెంచండి.https://studio.youtube.com/video/5d7459bWMLA/edit
చివరగా……………………………..
7.మీ పాత్రలో లీనమైపోండి. మీలోని కొత్త వ్యక్తిని బయటపెట్టి ధైర్యంగా పనిచేయండి. ఫలితంగా అంతులేని ఆత్మవిశ్వాసం మీదవుతుంది.https://studio.youtube.com/video/OQ15zmrMHOU/edit

