అందుకే చద్దన్నం తినమనేది.. వందల రోగాలని నయం చేసే ఈ పరమాద్భుతం గురించి మీకు తెలుసా..?
ఆధునిక ప్రపంచం.. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు.. ఆరోగ్యానికి హాని చేసే వాటిని తినడంతోపాటు.. పేలవమైన జీవనశైలిని అవలంభిస్తున్నారు.. దీంతో తరతరాలుగా పాటిస్తున్న అనేక ఆరోగ్యకరమైన అలవాట్లు ఆధునిక జీవనశైలిలో మరుగున పడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి రాత్రి మిగిలిపోయిన అన్నంతో తయారుచేసే చద్దన్నం. ఒకప్పుడు సాధారణమైన ఈ ఆహారం పాశ్చాత్య పోకడల కారణంగా ప్రాధాన్యతను కోల్పోయింది. అయితే, దీని విలువను అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్ వంటి సంస్థలు సైతం గుర్తించడం…
