కూలీ సినిమా విడుదల తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ కలయికలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతోందన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలింనగర్‌లో రోజూ వార్తలు చక్కర్లు కొట్టాయి. జైలర్ 2 తర్వాత రజినీ ఓ మల్టీస్టారర్‌లో నటిస్తారన్న వార్తలతో అభిమానులు సంతోషించారు. కూలీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే రజినీ-కమల్ మల్టీస్టారర్ ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. లోకేష్ గతంలో రజనీ, కమల్ ఇద్దరితోనూ సినిమాలు చేశారు. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు హఠాత్తుగా బ్రేక్ పడింది. మల్టీస్టారర్‌ను పక్కన పెట్టి, సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్ బ్యానర్లో రజినీకాంత్ హీరోగా మరో సినిమా ప్రకటించారు. దీంతో రజినీ-కమల్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలనుకున్న అభిమానులు డీలా పడిపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: హైప్ పెంచుతున్న తారక్ టీమ్.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా
హిట్టు కొట్టు.. కార్ పట్టు..! దర్శకులకు లగ్జరీ కార్ల బహుమతులు ఇవే
Spirit: స్పిరిట్‌లో చిరంజీవి.. ఇదిగో మెగా క్లారిటీ
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు
Ranabali: రణబాలి రౌద్రం.. విజయ్ విశ్వరూపం
