తాజావార్తలు

YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 9) చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకకు వైఎజ్ జగన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆశ్చర్యకరంంగా ఇదే వివాహ వేడుకకు లో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలు కూడా హాజరయ్యారు. కొత్త జంటను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ను సూర్య, కార్తీ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జగన్ ఆప్యాయతతో సూర్య, కార్తీలను హత్తుకున్నారు. అనంతరం ముగ్గురు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. వారందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా రాజకీయ ప్రముఖులు, సినిమా స్టార్లు ఒకే వేదికపై ఇలా సందడి చేయడంతో అభిమానులు ఈ వీడియోని తెగ ట్రెండ్ చేస్తున్నారు. కాగా వైఎస్ జగన్ పెద నాన్న కుమారుడే సునీల్ రెడ్డి. ఇప్పుడు ఆయన కుమారుడు సాహిల్ వివాహమే చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో భాగంగానే వైఎస్ జగన్, మిథున్ రెడ్డి, హీరోలు సూర్య, కార్తీ ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. ఇప్పుడీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పెళ్లి వేడుకలో వైఎస్ జగన్, సూర్య కార్తీ.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *