తాజావార్తలు

Watermelon Seeds: అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా? మీ పొట్టలో జరిగేదిదే..

Watermelon Seeds: అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా? మీ పొట్టలో జరిగేదిదే..


Watermelon Seeds: అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా? మీ పొట్టలో జరిగేదిదే..

వేసవిలో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిగా ఉండటమేకాకుండా వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి పుచ్చకాయ తినడం తప్పనిసరి. తీవ్రమైన వేడిలో శరీరాన్ని తాజాగా ఉంచడానికి పుచ్చకాయ కంటే మంచిన మరో ప్రత్యామ్నాయం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో కేలరీల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహ రోగులు కూడా పుచ్చకాయ హాయిగా తినవచ్చు. కాబట్టి ఎండ వేడిమికి చర్మం కమిలిపోకుండా ఉండాలంటే తియ్యని పుచ్చకాయ ముక్కలు తినాల్సిందే. ఫలితంగా మీ శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. పుచ్చకాయ మాత్రమే కాదు పుచ్చకాయ గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చాలా మంది పుచ్చకాయ తినేటప్పుడు పొరపాటున గింజలను మింగేస్తుంటారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఇది పొరపాటు కాదని నిపుణులు చెబుతున్నారు. పైగా పుచ్చకాయ గింజలను నేరుగా కూడా తినవచ్చు.

పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పుచ్చకాయ గింజలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయ గింజలు ఆహారం త్వరగా జీర్ణం కావడానికి కూడా సహాయపడతాయి. చర్మంపై ముడతలను తగ్గించడానికి లేదా చర్మపు కాంతిని పెంచడానికి పుచ్చకాయ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. పుచ్చకాయ ముక్కలుగా కట్‌ చేసి, దాని గింజలను వేరు చేయాలి. ఆ తర్వాత దానిని ఎండలో ఆరబెట్టి, పొడి పెనంలో వేయించాలి. ఈ గింజలను నేరుగా నమిలి తినవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేదా భోజనం తర్వాత తినవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు మధ్యాహ్నం పూట చిరుతిండిగా పుచ్చకాయ గింజలను తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆకలి తక్కువగా అనిపించి, వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే అన్నంతో పాటు పుచ్చకాయ గింజలను కూడా తినవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *