తాజావార్తలు

Viral Video: దూపైతుందని ఇంటికొచ్చి బుసలు కొట్టిన నాగుపాము.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ అంతే..

Viral Video: దూపైతుందని ఇంటికొచ్చి బుసలు కొట్టిన నాగుపాము.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ అంతే..


Viral Video: దూపైతుందని ఇంటికొచ్చి బుసలు కొట్టిన నాగుపాము.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ అంతే..

ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు.. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఇక మూగ జీవాల పరిస్థితి అయితే.. దారుణంగా ఉంది.. తీవ్రమైన ఎండలతో విలవిలలాడుతున్నాయి.. దాహం తీర్చుకునేందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి. పాములు కూడా దాహంతో బుసలు కొడుతున్నాయి. తాజాగా, తిరుపతి జిల్లా పుత్తూరులో ఒక ఇంట్లో పాము అలికిడి చేసింది. 6 అడుగులకు పైగా ఉన్న నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. దానికి నీళ్లు పోస్తే తాగి శాంతించింది.

పద్మావతి నగర్‌లోని ఓ ఇంటిలో ప్రత్యక్షమైన నాగుపామును చూసి భయంతో వణికిపోయిన ఇంటి యజమాని
స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ బుసలు కొడుతున్న పామును చాకచక్యంగా స్టిక్‌తో బంధించాడు.

పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ నాగు పాము దాహంతో ఉన్నట్లు గుర్తించాడు. ఎండల తీవ్రతను తాళలేక అటవీ ప్రాంతం నుంచి దాహర్తి కోసం వచ్చినట్టు గుర్తించి నీటిని తాపించే ప్రయత్నం చేసాడు.

వీడియో చూడండి..

అనంతరం స్నేక్ క్యాచర్.. ఆ నాగుపామును చాకచక్యంగా బంధించి.. అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.. ఇంట్లోకి వచ్చిన పాము.. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో ఇంట్లోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *