తాజావార్తలు

Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?

Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?


Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?

ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఒక ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అతనికి 18 ఏళ్లు వచ్చే సరికి ఇంకెన్ని రికార్డుల పని పడితాడో? అతను ఏ రికార్డుల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తాడు? అని అంతా ఎదురుచూస్తున్నారు. అసలు వైభవ్ సమం చేసిన ప్రపంచ రికార్డు ఏంటో ఓసారి చూస్తే, అతని ముందున్న టార్గెట్ ఏంటో తెలుస్తుంది. 18 ఏళ్ల వయస్సులోపు టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును ఈ బుడ్డోడు సమం చేసిన సంగతి తెలిసిందే.

18 ఏళ్ల వయస్సులోపు టీ20 క్రికెట్‌లో ఒక ఆటగాడు కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్ పేరిట ఉంది. అతను 68 సిక్సర్లు కొట్టాడు.

వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల 8 రోజుల వయసులోనే ఆ ప్రపంచ రికార్డును సమం చేశాడు. అతను ఇప్పటికే రహ్మానుల్లా గుర్బాజ్‌తో సమానంగా సిక్సర్లు కొట్టాడు.

వైభవ్ సూర్యవంశీ పేరిట టీ20 క్రికెట్‌లో 68 సిక్సర్లు ఉన్నాయి. వీటిలో 30 సిక్సర్లను అతను ఐపీఎల్‌లోనే కొట్టాడు. తన తదుపరి ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మరో సిక్సర్‌తో అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టనున్నాడు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. కాబట్టి అతనికి 18 ఏళ్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేదే ప్రశ్న. దానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అప్పటికి వైభవ్ ఖచ్చితంగా కొత్త రికార్డు శిఖరాలను చేరుకుంటాడు. కానీ, ఈ సమయంలో అంచనా వేయడం కష్టం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *