తాజావార్తలు

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు


ఉదయ్‌ కిరణ్‌.! ఎన్నో కష్ట నష్టాలకోర్చి..ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. చాలా తొందరగానే స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు.అంతే వేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. అవకాశాలు లేక డీలా పడ్డాడు. ఈక్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఈ లోకంలో ఉండలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 2014 జనవరి 5న ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి సుమారు పుష్కర కాలం దాటినా ఇప్పటికీ అతని సినిమాల రూపంలో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. రీసెంట్‌గా ఉదయ్ కిరణ్ .. మనసంతా నువ్వే రిలీజ్ అయింది. మరో సారి తమ అభిమాన హీరోను.. సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉదయ్‌ ఫ్యాన్స్‌కు ఇచ్చింది. ఇక ఈక్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జోస్యభట్ల ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయ్‌ కిరణ్‌ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ లో చాలా ఆటు పోట్లు చూశాడని చెప్పిన జోస్యభట్ల.. అతను నటించాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయంటూ చెప్పుకొచ్చాడు. షూటింగ్ ప్రారంభమై నిలిచిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయని.. ఒక సినిమా అయితే ఏకంగా ఎనభై శాతం షూటింగ్‌ పూర్తయిన తర్వాత పక్కన పెట్టారంటూ జోస్య భట్ల చెప్పుకొచ్చాడు. ఉదయ్‌ కిరణ్‌ నటించిన `ప్రేమంటే సులువు కాదురా` సినిమా 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆఖరి దశలో ఆగిపోయిందని జోస్య భట్ల రివీల్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయి విడుదలైతే ఉదయ్‌ కి పెద్ద హిట్‌ పడేదని ఆయన అన్నాడు. కానీ ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. నిర్మాతలు కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్రయత్నించినా అప్పట్లో కుదరలేదని ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాదు `ప్రేమంటే సులువు కాదురా` మూవీ విడుదలయ్యి ఉంటే మాత్రం ఇప్పుడు ఉదయ్‌ కిరణ్‌ మన మధ్య ఉండేవాడంటూ జోస్య భట్ల ఎమోషనల్ అయ్యాడు. అతను సూపర్ స్టార్ గా ఎదిగి ఉండే వాడని.. ఉదయ్‌ సినిమాలను మనం ఎంజాయ్‌ చేసేవాళ్లం అంటూ జోస్యభట్ల చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్ గురించి ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!

రజినీ, కమల్ మల్టీస్టారర్.. మరి వీరిలో హీరో ఎవరో తెలుసా..?

11 రూపాయలకే సినిమా చూపించిన మేకర్స్..

నిన్న మహేష్.. నేడు ప్రభాస్.. పూరి జగన్నాథ్ పై సంచలన కామెంట్స్

నేను రెడీ షూటింగ్ పూర్తి.. సమ్మర్‌లో విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *