తాజావార్తలు

TVK Vijay: విజయ్ విడాకుల కేసులో తెరవెనక ఏం జరిగింది.. సంగీత ఆరోపిస్తున్న హీరోయిన్ ఎవరు..?

TVK Vijay: విజయ్ విడాకుల కేసులో తెరవెనక ఏం జరిగింది.. సంగీత ఆరోపిస్తున్న హీరోయిన్ ఎవరు..?


దళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఒకప్పుడు విజయ్‌కు వీరాభిమానిగా పరిచయమై, ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించుకుని.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగీత.. ఇప్పుడు ఆయనకు దూరంగా ఉండటం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవని, సంగీత ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి అక్కడే ఒంటరిగా ఉంటున్నారని సమాచారం. ఒక ఆదర్శ జంటగా పేరుతెచ్చుకున్న వీళ్ళు.. ఇప్పుడు ఏకంగా విడాకుల దాకా వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విడాకులకు ప్రధాన కారణం విజయ్‌కు ఉన్న వివాహేతర సంబంధాలే అని సంగీత వర్గం బలంగా వాదిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో విజయ్‌కు ఒకరిద్దరు హీరోయిన్లతో ఎఫైర్ ఉందనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా ఆయనతో కలిసి నటించిన ఒక స్టార్ హీరోయిన్, ఆ సినిమా పూర్తయిన తర్వాత ఏకంగా విజయ్ ఉంటున్న ఏరియాలోనే ఇల్లు కొనుక్కోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ విషయం వేరే వాళ్ల ద్వారా తెలుసుకున్న సంగీత.. తీవ్ర మనస్తాపానికి గురై అప్పట్లోనే ఆయనతో విడిపోయి అమెరికా వెళ్లిపోయారని సమాచారం. పైగా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్.. గత కొన్నేళ్లుగా ఓ హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. విజయ్ కేవలం స్టార్ హీరోగా ఉన్నంత కాలం ఈ వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో.. అప్పటి నుంచి పక్క పార్టీల నేతలు ఆయన్ని పర్సనల్‌గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. రీసెంట్‌గా ఒక బీజేపీ ఎంపీ ఏకంగా స్టార్ హీరోయిన్ త్రిషతో విజయ్‌కు లింక్ పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనిపై వెంటనే స్పందించిన త్రిష.. తనను రాజకీయ వివాదాలతో ముడిపెట్టొద్దంటూ ఒక ఓపెన్ లెటర్ విడుదల చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సంగీత విడాకులు కోరుతుండటంతో.. ఇన్నాళ్లూ వినిపించిన ఈ పుకార్లన్నీ నిజమేనేమో అన్న వాదనలు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో బలంగా నాటుకుపోతున్నాయి. పైగా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సంగీత ఇలా ఓపెన్ అయిపోవడం విజయ్ పర్సనల్ ఇమేజ్‌ను బాగా దెబ్బ తీసేలా కనిపిస్తుంది. ఈ పర్సనల్ దెబ్బ రాజకీయాలపై కూడా పడుతుందా..? ఆయన పార్టీ గెలుపోటములను దెబ్బ తీస్తుందా అనేది చూడాలి. ఐదేళ్లుగా నరకం చూస్తున్నానని చెప్పిన సంగీత.. సరిగ్గా ఎన్నికల ముందే ఇలా బయటికి రావడం.. విడాకులకు అప్లై చేయడం వెనక ఏదైనా రాజకీయ కుట్ర దాగుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.

ఇక విజయ్ కుటుంబపరంగా ఎదుర్కొంటున్న మరో షాక్.. ఆయన కొడుకు జాసన్ సంజయ్. గత కొంతకాలంగా తండ్రి విజయ్‌తో సంజయ్ ఏమాత్రం టచ్‌లో లేడని, ఆయనతో పూర్తిగా అంటిముట్టనట్లుగానే ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు అయ్యుండి కూడా తండ్రి పేరు వాడుకోకుండా, ఆయన సపోర్ట్ లేకుండా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తండ్రిలాగా హీరో అవ్వకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తూ తన పని తాను చేసుకుపోతున్నాడు. కొడుకు ఇలా దూరంగా ఉండటం కూడా విజయ్ ఇంట్లో ఉన్న కలహాలను స్పష్టం చేస్తోంది.

మొత్తానికి ఒకవైపు రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నిస్తున్న విజయ్‌కు.. సొంత కుటుంబంలో జరుగుతున్న ఈ పరిణామాలు పెద్ద బ్రేక్ వేసేలా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ తన స్టార్‌డమ్ చాటున దాగి ఉన్న పర్సనల్ లైఫ్ వివాదాలు, ఎఫైర్ రూమర్స్ అన్నీ ఇప్పుడు రాజకీయంగా ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భార్య విడాకులు కోరడం, కొడుకు దూరంగా ఉండటం లాంటివి రాజకీయ ప్రత్యర్థులకు పదునైన అస్త్రంగా మారాయి. ఏదేమైనా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వరసగా దెబ్బలైతే తగులుతూనే ఉన్నాయి. 2025 సెప్టెంబరు 27న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగి.. ఏకంగా 41 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆయన నటించిన జన నాయగన్ సినిమాను అడ్డుకున్నారు.. ఇప్పుడేమో భార్య విడాకులకు అప్లై చేసింది. మరి ఈ సంచలన ఆరోపణలు, విడాకుల వార్తలపై దళపతి విజయ్ ఎలా స్పందిస్తారో, తన పొలిటికల్ కెరీర్‌ను ఈ డ్యామేజ్ నుంచి ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *