సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు.
వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ హిట్స్ మాత్రం ఒకటి రెండు మాత్రమే.. హిందీలోనూ ట్రై చేసింది కానీ .. అక్కడా లాభం లేకుండా పోయింది.
అవకాశాలు లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు.. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు.
ఆమె ఎవరో కాదు బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్. శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.ఆతర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది. ఆతర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ చిన్నది.
ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. బాలీవుడ్ ఇండస్టీలో కొరియోగ్రాఫర్ గా చేసిన సీరత్ కపూర్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది.





