తాజావార్తలు

Set a goal for success in life.Do you want to be a winner?

జీవితంలో సాధించబోయే విజయానికి గమ్యాన్ని నిర్దేశించుకోండి

మీ జీవితం సాఫీగా సరైన దారిలో నడవాలంటే మీ జీవితానికో స్పష్టమైన గమ్యం వుండాలి.

మీ జీవితం సాఫీగా సరైన దారిలో నడవాలంటే………………. మీ జీవితానికో స్పష్టమైన గమ్యం వుండాలి.

జీవితంలో సాధించబోయే విజయానికి గమ్యాన్ని నిర్దేశించుకోండి

ప్రముఖ వ్యక్తిత్వపు పుస్తకాల రచయిత నెపోలియన్ హిల్ చెప్పినట్లు ‘మీ హృదయం నిరంతరం దేనిని వాంఛిస్తుందో దానిని పొందుతుంది.’ ఇక్కడ మనం ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని వుంటే హృదయం ఎప్పుడూ దానినే వాంఛిస్తుంది. https://www.youtube.com/shorts/zyKfl_H_SkQ

ఫలితంగా మన లక్ష్య సాధన సులువౌతుంది.

ఇప్పుడు ఆ కలకు స్పష్ట రూపాన్ని ఇచ్చి గమ్యాన్ని నిర్దేశించండి.

నేను పదికోట్లు సంపాదించాలి” (సంపద)

“నేను రాజకీయ నాయకుడిని కావాలి” (పలుకుబడి)

“నేను సినిమా హీరోని కావాలి” (కీర్తి, పాపులారిటీ)

ఇవన్నీ స్పష్టమైన గమ్యాలు.https://www.youtube.com/shorts/lHZ54TBXbiI

అలాకాక అసాధ్యమైన గమ్యాల గురించి ఆలోచించకూడదు. ‘నేను అమెరికా ప్రెసెడెంట్ని కావాలి’ ‘ఫలానా సినీతార నాకు భార్య కావాలి’, ‘క్రికెట్లో నేను ఆడే ప్రతి బంతీ సిక్సర్ కొట్టాలి’ లాంటి అసాధ్యపు పనులు నిజమైన గమ్యాలు కావు.

అవి అసాధ్యపు ఊహలు. ఊహలు వేరు, గమ్యాలు వేరు.

ఆమెకి చాలా చిన్న వయసులోనే వివాహం జరిగింది. అయితే అప్పట్లో జరుగుతున్న స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ఆమెని బలంగా ఆకర్షించింది.

తన దేశానికి జరుగుతున్న పోరాటంలో ఆమె ఎలాగైనా పాల్గొనాలని భావించింది.

ఫలితంగా తన భర్తకి మరో పెళ్ళి చేసి తన బంధాలను తెంచుకొని ఆమె స్వాతంత్ర్య సమర పోరాటంలో కాలుపెట్టింది. తన గమ్యసాధన కోసం ఆమె ఆ అసాధారణ సాహసిక చర్యని తీసుకుంది.

ఆమె… దుర్గాబాయ్ దేశముఖ్. అలా గమ్యసాధనలో తన అడ్డంకులను ఆధిగమించి మరీ చరిత్రపుటలలో నిలిచింది.

మీకు తెలుసా ఎడిసన్ తన చిన్నప్పుడు బ్రతకడానికి న్యూస్పేపర్లు అమ్మాడని. తన హృదయంలోని గమ్యసాధనకై పదివేలసార్లు విఫలమైనా తుదకు గమ్యాన్ని సాధించాడు.

మయూరి సుధ జీవిత లక్ష్యం చక్కటి డాన్సర్ కావడం. అలాగే అయింది. కాని విధి ఆడిన నాటకంలో ఆమె కాలుని యాక్సిడెంట్ బలి తీసుకొంది. అయినా ఆమె తుదకు అదే కాలుతో నాట్యం చేసి తన గమ్యాన్ని సాధించుకొంది.

అమితాబ్ బచ్చన్ని ‘నీవు సినిమాకి పనికిరావు’ అన్నారు హిందీ సినిమా నిర్మాతలు. కాని నటనే తన జీవిత ధ్యేయంగా తీసుకున్న అమితాబ్ బచ్చన్ తుదకు హిందీ సినిమా రంగంలోనే మకుటంలేని రాజుగా కొనియాడబడ్డాడు.

మీరొకసారి పరిశీలించండి. నేడు ప్రసిద్ధి పొందిన అనేకమంది దర్శకులు, సంగీత దర్శకులు, మాటల రచయితలు దాదాపు పది సం॥రాలు స్టూడియోల చుట్టూ తిరిగిన వారే! వారందరి గమ్యం ఒకటే – సినీ ఫీల్డ్లో పేరు తెచ్చుకోవడం. ఆ గమ్యానికి ఎన్నాళ్ళయినా పట్టనీ తుదకు లక్ష్యాన్ని చేరుకోగలగడం వారి గొప్పతనం!https://youtu.be/1OCfbYByoBg?si=LLKGH2l6bbtyn2t9

అయితే గమ్యాన్ని ఎన్నుకొనే ముందు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఏదో గాలివాటపు గమ్యం కాకుండా నిర్దుష్టంగా, మీకు ఆసక్తిగా వుండే గమ్యాన్ని ఎన్నుకోవాలి.

అసలు మీరు ఎలాంటి వ్యక్తి?

*అసలు మీరు ఎలాంటి వ్యక్తి? అదే మీరు పదిమందితో కలివిడిగా ఉండని వ్యక్తయితే సేల్సు మానేజర్, పత్రిక విలేఖరి లాంటివి కాకుండా ఆఫీసులో బల్లమీద పనిచేసే వృత్తికి సంబంధించిన కోర్సులు ఎన్నుకోండి.

*మీ కుటుంబ స్థితిగతులు:

*మీ కుటుంబ స్థితిగతులు: మీ తల్లిదండ్రులు చక్కటి విద్యావేత్తలు లేదా

వైద్యులు అయితే మీరు అదే రంగం వేపు తేలికగా ఆకర్షితులౌతారు. మీ పూర్వీకుల ప్రాక్టీసు మీకు వంశపారంపర్యంగా అబ్బుతుంది. ఒకవేళ మీ తల్లిదండ్రులు విద్యావేత్తలు కాకపోతే, మీ టీచర్లు, ఇతర కౌన్సిలర్ల సలహా ప్రకారం మీ కెరీర్ని మీ అభిరుచి ప్రకారం ఎన్నుకోవచ్చు.

*ఆసక్తి:

*ఆసక్తి: మీకు లెక్కల్లో ఆసక్తి లేదనుకోండి. మీరు ఎన్నటికీ ఇంజనీర్ కాలేరు. మీకు చుట్టూ వున్న సమాజం మీద, సమకాలీన రాజకీయాల మీద మంచి పట్టు వున్నట్లయితే మీరు సివిల్ సర్వీసెస్కి ప్రయత్నించగలరు.

పై విషయాలను పరిగణనలోకి తీసుకొని ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే మీరు జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకోగలరు.

మీ గమ్యం

మీ గమ్యం అస్పష్టంగా వుండకూడదు. స్పష్టంగా వుండాలి. ఉదాహరణకు యం. సెట్ మీ ధ్యేయం అనుకుందాం. యం. సెట్లో మీరు ఎన్నుకోబోయేది డాక్టర్ కోర్సా? ఇంజనీరింగ్ కోర్సా? ఇంజనీరింగ్ కోర్స్ అయితే సివిలా, మెకానికలా? లేక ఎలక్ట్రికలా? కంప్యూటర్ సైన్సా? అలా గమ్యం స్పష్టంగా వుండాలి.

మీ గమ్యం సాధించదగినదిగా వుండాలి. మీకు సైన్స్, మ్యాథ్స్ అంటే అసలు ఆసక్తి లేదు. ఆ రెండింట్లో కనీస పరిజ్ఞానం లేదు. అయినా “నేను డాక్టర్ని అవుతాను” అని మీరు గమ్యం నిర్దేశించుకుంటే ఎప్పటికీ సాధించలేనిదే అవుతుంది.

300 అలాగే మీ గమ్యానికి కాల పరిమితి వుండాలి. జీవితకాలంలో ‘ఎప్పుడో అప్పుడు డాక్టర్ని అవుతాను’ అనే గమ్యం అవాస్తవమైంది. ఎందుకంటే 22 సం॥రాలు దాటితే మీకు యం.సెట్. రాయడానికి అవకాశం వుండదు. అందువల్ల గమ్యం సాధించడానికి పట్టే సమయాన్ని సైతం నిర్దుష్టంగా పేర్కొనండి.

మీ గమ్యసాధనలో తగిలే అవరోధాలు,

మీ గమ్యసాధనలో తగిలే అవరోధాలు, మీ వ్యక్తిగత బలహీనతల గురించి ఆలోచించండి. వాటిని ఓ కాగితం మీద రాసుకోండి.

వీలైతే గమ్యసాధనకి ఇతరుల సహాయం తీసుకోండి. మీ గమ్యసాధనకి సహకరించే సంస్థలు, వ్యక్తులను దృష్టిలో వుంచుకోండి. వారినుండి మీరు ఆశించేది ఏదో స్పష్టంగా నిర్ణయించుకోండి. ఒక్కో అవరోధాన్ని గురించి పరీక్షిస్తూ వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచించండి.

తర్వాత గమ్యాన్ని సాధించుకోవడానికి ఓ నిర్దిష్ట ప్రణాళిక వేసుకోండి. ఏ పని ముందు, ఏ పని వెనకాల చేయాలో నిర్ణయించుకొని తదనుగుణంగా ఉద్యమించండి.

కేవలం గమ్యాలను నిర్దేశించుకోవడమే కాక అప్పుడప్పుడు (ఒక నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం) వాటిని సమీక్షిస్తుండాలి. ‘నేను నిర్దేశించుకున్న గమ్యం ఎంతవరకు వచ్చింది? సకాలంలో పూర్తవుతుందా? లేకపోతే ఏం చెయ్యాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి?’ లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

గమ్యాలు-రకాలు

గమ్యాలు ఎన్నో రకాలు. అవి స్వల్ప కాలిక గమ్యం, మధ్యకాలిక, దీర్ఘకాలిక గమ్యం. వాటిని స్పష్టంగా ఇలా నిర్వచించాలి.

కాలం………………………………………………………………పని………………………………………………………….పూర్తవ్వాల్సిన తేది

స్పల్ప కాలం (ఒక సం॥)…………………….క్లాసు ఫస్ట్ రావడం………………………………………….1-12-2026

మధ్య కాలం (మూడు సం॥లు)………యం. సెట్ కోసం ఇంటెన్సివ్ కోచింగ్……………1-12-2028

దీర్ఘకాలం (ఐదు సం॥లు)……………….యం. సెట్లో ర్యాంక్ తెచ్చుకోవడం…………………..1-12-2030

మెడికల్ కాలేజీలో సీటుని సంపాదించడం

**************************************************************************************************************

అది ద్రౌపది స్వయంవరం. అనేక దేశాల నుండి రాజకుమారులు వేంచేశారు. పైన స్తంభానికి తగిలించిన చేప బొమ్మని క్రింద నీటిలో చూసి బాణంతో కొట్టాలి. చాలామంది రాకుమారులు ప్రయత్నం చేశారు. కాని కొట్టలేకపోయాడు. ఒక్క అర్జునుడు మాత్రమే గురిచేసి మత్స్యయంత్రాన్ని కొట్టగలిగాడు.

ఈ కథ నీతి ఏమిటి? మీ గమ్యం మీద పూర్తి దృష్టిని వుంచగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. కాబట్టి లక్ష్యాన్ని సాధించగలిగేటట్లుగా మీ దృష్టిని కేంద్రీకరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *