తాజావార్తలు

Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని


Ram Pothineni: ఏందన్నా అంత మాటన్నావ్! పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. చివరిగా అతను నటించిన ఆంధ్రాకింగ్ తాలుకా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఎందుకోగానీ ఈ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉంటున్నాడు రామ్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రామ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఈ హీరో వయసు సుమారు 37 సంవత్సరాలు. ఆ మధ్యన ఆంధ్రాకింగ్ తాలుకా సినిమాతో తనతో కలిసి నటించిన భాగ్యశ్రీ బోర్సేతో రామ్ రిలేషన్ లో ఉన్నాడని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సింగిల్ గా ఉండడమే తనకు ఇష్టమంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడీ హ్యాండ్సమ్ హీరో.

 

‘నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటానికే అలవాటు పడ్డాను. ఖాళీ సమయాన్ని కూడా ఆస్వాదిస్తాను. స్నేహితులతో, ఇతర వ్యక్తులతో గడపడం ఇష్టమే అయినా.. నాకోసం నేను సమయాన్ని కేటాయించుకోవడంలో ఆనందం ఉంటుంది. ఆ ఏకాంతం నాకు మానసికంగా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఎవరైనా నా జీవితంలోకి వస్తే వారితో సమయం గడపడానికి నేను సిద్ధమే. ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగా అయినా మరింత సంతోషంగా ఉంటాను. ఇది నా వ్యక్తిత్వం మాత్రమే, కావాలని తీసుకున్న నిర్ణయం కాదు. సినిమా రంగంలో ఎప్పుడూ వందలాది మందితో ఉండడం తప్పదు. అయితే అంత మంది మధ్య కూడా నా కంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఏడాదిన్నర పాటు ఒంటరిగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు రామ్. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆంధ్రాకింగ్ తాలుకా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు రామ్. ఇప్పుడు లోకేష్ కనకరాజు అసిస్టెంట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *