తాజావార్తలు

Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్


Mrunal Thakur: ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం అంటున్న మృణాల్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాటీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్‌ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

డెకాయిట్ లో చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా డిఫికల్ట్. అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్‌ను యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. ఒక యాక్టర్‌కు ఛాలెంజ్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ క్యారెక్టర్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నా కెరీర్‌లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇప్పటివరకు నేను చేయని కొత్త జానర్ ఇది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను.

సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయి లాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. నాకు ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్ చేయాలని ఉంటుంది. అలాగే నాకు నేనే సర్ప్రైజ్ అవ్వడం ఇష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన సినిమా ఇది. నాకు కొత్త ఎమోషన్స్ ఉన్న సినిమాలు చేయాలనిపిస్తుంది. ఇప్పటివరకు చేయని క్యారెక్టర్లు చేయాలనే తపన ఉంటుంది. డెకాయిట్ కూడా అలాంటి కొత్త జానర్ సినిమా అని చెప్పుకొచ్చింది మృణాల్.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *