తాజావార్తలు

అల్సర్ డేంజర్! ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే …జాగ్రత్తII

కడుపు అల్సర్ ఎందుకు వస్తుంది? లక్షణాలు, కారణాలు, నివారణ

అల్సర్ డేంజర్!

ఛాతీలో మంట అనిపిస్తే చేతికందిన యాంటాసిడ్ వాడేస్తూ ఉంటాం.

కానీ తాత్కాలిక ఉపశమనాన్నిచ్చే ఈ మందులు వాడుతూ కాలం గడిపేస్తే సమస్య మరింత ముదిరి కడుపులో అల్పర్లు తయారవుతాయి.

ఈ రుగ్మతను మరింత నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయానికి రంధ్రాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

అల్సర్ అంటే ఏమిటి?

అల్సర్ అనేది కడుపులో లేదా ఆహారనాళంలో ఏర్పడే గాయం. ముఖ్యంగా కడుపు లోపలి పొర దెబ్బతినడంతో ఈ సమస్య వస్తుంది. Stomach Ulcer లేదా గ్యాస్ట్రిక్ అల్సర్ అని కూడా అంటారు.

సాధారణంగా, ఎక్కువ రోజులు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండటం, మందులు ఎక్కువగా వాడటం లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల అల్సర్ వస్తుంది.

అల్సర్‌ను నిర్లక్ష్యం చేస్తే కడుపు నొప్పి పెరగడం, వాంతులు, ఆకలి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అయితే, సమయానికి చికిత్స తీసుకుంటే అల్సర్ పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

అల్సర్’ డేంజర్!

మొదట…
మనము తిన్న ఆహారం జీర్ణమవటం కోసం జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ‘తయారువుతూ ఉంటుంది.

ఈ ఆమ్లం కారణంగా జీర్ణాశయం దెబ్బతినకుండా దాని లోపల పల్చని పొర ఉంటుంది. అందువల్ల

అయితే ఈ యాసిడ్ అవసరానికి మించి ఉత్పత్తి అయినా, జీర్ణాశయం లోపలి రక్షణ పొర వివిధ కారణాల వల్ల బలహీనపడినా సమస్యలు మొదలవుతాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ….

అసిడిటీ

అసిడిటీ అనే ఈ సమస్యలో ఛాతీలో మంట, కడుపు నొప్పిలాంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి.

అయితే అరుదుగా కొందరిలో అసలు లక్షణాలే కనిపించవు. లక్షణాలు కనిపించినప్పుడు అందుబాటులో ఉన్న యాంటాసిడ్లు వాడి తక్షణ ఉపశమనం పొందుతూ ఉంటాం.

అయితే ఈ మందులన్నీ ఆ ఆమ్లాన్ని పలుచన చేసేవే తప్ప దాని స్రావాన్ని నియంత్రించలేవు.

అలాగే జీర్ణాశయం లోపలి రక్షణ పొర బలహీన పడటానికి కారణాల్ని తెలుసుకుని వాటిని సరిద్దిదనంతకాలం ఈ సమస్య పదే పదే తలెత్తుతూనే ఉంటుంది.

ఇలా జరగకుండా ఉండాలంటే మూల కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్సనందించాలి. https://youtu.be/9Kns1S-ytLA?si=TM7azCiPaR33-UQP

వైద్యులు అందించే సమర్ధమైన చికిత్సతో మాత్రమే ఈ సమస్యనుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు.

ఒకవేళ పూర్తిగా యాంటాసిడ్ల మీదే ఆధారపడుతూ కాలం గడిపేస్తూ ఉంటే కొంతకాలానికి సమస్య మరింత ముదిరి జీర్ణాశయం లోపలి గోడలు దెబ్బతిని పరిస్థితి సర్జరీకి దారితీస్తుంది.

అల్సర్లలో రకాలు

సాధారణంగా అల్సర్లు జీర్ణాశయం, చిన్న పేగు మొదటి భాగమైన డియోడినమ్లో తలెత్తుతాయి.

అల్సర్లు తలెత్తటానికి ఎన్నో కారణాలుంటాయి. శరీరంలో రక్షణ వ్యవస్థ మందగించటం వల్ల జీర్ణాశయం లోపలి పొర బలహీనమయితే అందుకు కారణాలను కనిపెట్టి వాటిని చక్కదిద్దాలి.

ఒకవేళ ఆమ్లం అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంటే దానికి మూల కారణాన్ని వెతికి దాన్ని సరిచేయటంతోపాటు స్రావం ఉత్పత్తిని నియంత్రించాలి.

అలాగే అల్సరు రకం, తీవ్రత, మందులకు స్పందించే విధానం ఆధారంగా చికిత్సనందించాలి. అల్సర్లలో కూడా రకాలుంటాయి. అవేంటంటే…

.అల్సర్లలో రకాలు

డయాబెటిక్ అల్సర్ – షుగర్ వ్యాధి ఉన్నవారిలో ముఖ్యంగా కాళ్లలో వచ్చే అల్సర్

గ్యాస్ట్రిక్ అల్సర్ – కడుపులో (స్టమక్‌లో) ఏర్పడే అల్సర్

డ్యూడెనల్ అల్సర్ – చిన్న ప్రేగు (డ్యూడెనమ్) లో వచ్చే అల్సర్

పెప్టిక్ అల్సర్ – గ్యాస్ట్రిక్ మరియు డ్యూడెనల్ అల్సర్లను కలిపి ఇలా అంటారు

మౌత్ అల్సర్ (నోటి పుండ్లు) – నోటి లోపల వచ్చే అల్సర్లు

ప్రెషర్ అల్సర్ (బెడ్ సోర్స్) – ఎక్కువసేపు పడుకుని ఉండడం వల్ల చర్మంపై వచ్చే అల్సర్

వెనస్ అల్సర్ – రక్త ప్రసరణ సరిగా లేక కాళ్లలో వచ్చే అల్సర్

ఆమ్లం కారణంగా:

అవసరానికి మించిన ఆమ్ల స్రావం వల్ల అల్సర్లు తలెత్తుతాయి.

బ్యాక్టీరియా వల్ల:

బ్యాక్టీరియా వల్ల కలుషిత నీటి ద్వారా హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా పొట్టలోకి చేరి అల్సర్లు తయారవుతాయి. కాబట్టి ఈ అల్సర్లని నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్గా కూడా మారతాయి.

క్యాన్సర్: క్యాన్సర్తో కూడిన అల్సర్లు కూడా తయారవుతాయి.

అల్సర్లకు ప్రధాన కారణాలు

అస్తవ్యస్థ జీవన విధానం, ఆహార నియమాలు పాటించకపోవటం, ఎక్కువ మసాలాలు, కారం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవటం, కారణాల వల్ల అల్సర్లు తయారవుతాయి


మరియు ఒత్తిడి, ఆందోళన, నొప్పి తగ్గించే మందులు, యాంటిబయాటిక్ మందుల్ని విచక్షణారహితంగా వాడటం,

మరియు మద్యపానం, ధూమపానం, పొగాకు నమలటం, కాఫీలు ఎక్కువగా తాగటం, హెచ్.పైలోరీ బ్యాక్టీరియా జీర్ణాశయంలోకి చేరటం, క్యాన్సర్ మొదలైన కారణాల వల్ల అల్సర్లు తయారవుతాయి.https://youtu.be/Yea4NztGcps?si=n1urzHVhHwmPj9E4

అల్సర్ లక్షణాలు

లక్షణాలు

మన ఛాతీ ఎముక, నాభికి మధ్య, పక్కటెముకల కింద, వీపులో నొప్పి అల్సర్ ప్రధాన లక్షణాలు. సాధారణంగా ఈ లక్షణాలు ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత మొదలవుతూ ఉంటాయి.

అంటే భోజనానికి భోజనానికి మధ్య ఖాళీ సమయంలో, రాత్రి వేళ విడవకుండా నొప్పి ఉంటుంది.

అలాగే ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. కొందరిలో వాంతి, ఉబ్బరం లక్షణాలు కూడా ఉంటాయి.

ఇవన్నీ అల్సర్ ప్రారంభ లక్షణాలు. అల్సర్ మరింత ముదిరినప్పుడు జీర్ణాశయం రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది.

రక్తస్రావం ఎక్కువగా ఉంటే రక్తం, యాసిడ్ కలిసి కాఫీ రంగులో వాంతులవుతాయి. అందువల్ల మలం కూడా నలుపు రంగులో ఉంటుంది.

ఈ సమస్య మరింత ముదిరితే జీర్ణాశయంలో రంథ్రం పడి తిన్న ఆహారం పేగులు, పొట్ట మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలోకి వెళ్లిపోతుంది.

అప్పుడు ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. ఈ స్థితికి చేరుకున్న రోగి ప్రాణాలను కాపాడటం కష్టం. కొందరిలో డియోడినమ్లో పదే పదే అల్సర్లు తయారవుతూ వాటంతటవే మానుతూ ఆ ప్రదేశంలో మచ్చలా తయారవుతుంది.

ఈ మచ్చ వల్ల చిన్నపేగు మార్గం మూసుకుపోయి సమస్య తలెత్తుతుంది. దాంతో తిన్న ఆహారం వెంటనే వాంతి అయిపోతూ ఉంటుంది.

అల్సర్లు రాకుండా…అల్సర్ నివారణ మార్గాలు…

సమయానికి ఆహారం తీసుకోవాలి.

మసాలాలు, కారం, కొవ్వులు, పుల్లటి పదార్థాలు వీటిలో వేటి వల్ల మంట తలెత్తుతుందో కనిపెట్టి వాటికి దూరంగా ఉండాలి.

కలుషిత నీరు తాగకూడదు. పరిశుభ్రత పాటించాలి.

” నొప్పి తగ్గించే మందులు పరిమితంగా వాడాలి.

ఒత్తిడి తగ్గించుకోవాలి.

ధూమపానం, మద్యం మానేయాలి.

అల్సర్ నివారణ మార్గాలు….

చివరగా (Finally)…అల్సర్లు రాకుండా ఉండాలంటే …..

  1. సమయానికి భోజనం చేయాలి – భోజనం మానేయకూడదు.
  2. కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తగ్గించాలి
  3. అల్కహాల్ (మద్యం) తీసుకోవడం మానుకోవాలి
  4. పొగ త్రాగడం (స్మోకింగ్) పూర్తిగా ఆపాలి
  5. స్ట్రెస్ (మానసిక ఒత్తిడి) తగ్గించుకోవాలి
  6. డాక్టర్ చెప్పకుండా నొప్పి మందులు (Pain killers) వాడకూడదు
  7. శుభ్రత పాటించాలి – చేతులు కడుక్కొని భోజనం చేయాలి
  8. సమృద్ధిగా నీరు తాగాలి
  9. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి – పండ్లు, కూరగాయలు ఎక్కువగా
  10. పేగుల సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *