కష్టపడే స్వభావం

పదివేలసార్లు తన ప్రయోగం విఫలమైనా విసుగు చెందక తిరిగి తన ప్రయత్నాన్ని కొనసాగించి తుదకు ప్రపంచానికే వెలుగు ప్రసాదించిన థామస్ అల్వా ఎడిసన్ సక్సెస్కు అత్యధిక కారణం ‘హార్డ్ వర్క్’ అని చెప్పక తప్పదు.
ఆయన ఉద్దేశంలో కష్టపడటాన్ని మించిన ప్రత్యామ్నాయం లేదు.
“Hard Work (కష్టపడి పని చేయడం)”
Hard Work గురించి 5 ముఖ్యమైన పాయింట్లు తెలుగులో 👇
1.ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి – “నేను చేయగలను” అనే నమ్మకం హార్డ్ వర్క్‌కు శక్తినిస్తుంది.
2.లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి – మనం ఏం సాధించాలనుకుంటున్నామో ముందే నిర్ణయించుకోవాలి.
3.నిరంతర కృషి అవసరం – ప్రతిరోజూ కష్టపడితేనే విజయం సాధ్యం.
4.అడ్డంకులను భయపడకూడదు – సమస్యలు వస్తాయి, కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి.
5.సమయాన్ని సరిగ్గా ఉపయోగించాలి – సమయం వృథా చేయకుండా పని చేయాలి.
విజయం ఎవరికయినా తేలికగా రాదు. అది ఎంతో ఓపికని, త్యాగాన్ని కోరుతుంది.

మీరు విజయం సాధించాలంటే నిరంతరం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. మీరు కష్టపడుతున్నది మీ కోసమే కాని ఇతరుల కోసం కాదు.
మీ కోసం మీరు కష్టపడటాన్ని మించిన ఆనందం ఏముంటుంది? రోజుకు పధ్నాలుగు గంటలు కష్టపడ్డా అది మన సంతృప్తి కోసమేనని తెలుసుకోవాలి.
గమ్యసాధన కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఓ వర్క్ హాలిక్ కష్టపడుతూనే ఉండాలి. వర్షం కురుస్తున్నా, 47 డిగ్రీల ఎండ కాస్తున్నా, కష్టపడుతూనే ఉండాలి.
ఈ ప్రకృతిలో అనంతమైన ఆహారపదార్థాలు వున్నాయి. ప్రకృతి ఆహారాన్ని మన నోట్లో పెట్టదు. దానిని నోట్లోకి తీసుకోవడం మన వంతు. అందుకు నిరంతరం కష్టపడుతూనే ఉండాలి.
మీకు తెలుసా ఐశ్వర్యరాయ్ హిందీ సినీరంగంలో ఉన్నత స్థానం కోసం పదేళ్ళు కష్టపడింది.
తుదకు ఆ కష్టపు ఫలితంగా నేడు భారతీయ సినీ రంగానికి నెంబర్ వన్ హీరోయిన్ అవడమేకాక హాలివుడ్ సైతం అడుగుపెట్టింది. వెబ్స్టర్ నిఘంటువుని సమర్పించడానికి వెబర్కి 36 సం॥రాలు పట్టాయి.
చివరిగా
కాబట్టి కష్టాన్ని మించిన ప్రతిఫలం లేదని తెలుసుకోండి.
