తాజావార్తలు

He took gold from SIM cards!

He took gold from SIM cards!

సిమ్కార్డుల నుంచి బంగారం తీశాడు!

రోజురోజుకీ బంగారం ధర ఎలా పెరిగిపోతుందో చూస్తున్నారుగా! తులం బంగారం కొనాలంటే చేతిలో లక్షలుండాల్సిందే. 
అలాంటిది చైనాలోని గ్వాంగ్జాంగ్ ప్రాంతంలో ఉన్న క్వియావో అనే వ్యక్తి- పారేసిన పాత సిమ్కార్డులనుంచీ, ఇతరత్రా చిప్స్ నుంచీ రూ.27 లక్షల విలువ చేసే 200గ్రాముల బంగారాన్ని సేకరించాడు.
అదేమంత సులభమైన పనికాదు, ఎందుకంటే ఒక్కో సిమ్కార్డులో 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది 200గ్రా బంగారాన్ని సేకరించాలంటే ఎన్ని సిమ్కార్డులూ, చిప్స్ కావాలో ఊహించుకోవచ్చు.

చెత్తను సేకరించి అమ్మే ఇతనికి ఇలా చిప్స్ నుంచి విలువైన లోహాలని వేరుచేయడమంటే ఆసక్తి అట.

ఇందుకోసం 'నాలుగులక్షల సిమ్కార్డులని సేకరించి అత్యంత జాగ్రత్తగా రసాయనాలని వాడి ఈ బంగారాన్ని వేరుచేశా' అంటున్న క్వియావో వీడియో ఒకటి వైరల్ కావడంతో అతన్ని నెటిజన్లంతా ఆల్కెమిస్ట్ అంటూ పొగుడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *