తాజావార్తలు

Gold Prices Today: రూట్‌ మారింది.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gold Prices Today: రూట్‌ మారింది.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?


Gold Prices Today: రూట్‌ మారింది.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డాలర్ తగ్గితే సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.3వేలకుపైగా పెరిగింది.

ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,52,960 కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే తులం 1,40,200 వద్ద స్థిరపడింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,14,710 కొనసాగుతోంది.

హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా

  • గురువారం ఉదయం 6గంటలకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,960గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,52,950 వద్ద కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల ధర ఇవాళ రూ.1,40,210 వద్ద ఉండగా.. నిన్న రూ.1,40,200 వద్ద ట్రేడవుతోంది.
  • ఇక ఆంద్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,960 వద్ద ట్రేడవుతోండగా.. నిన్న రూ.1,52,950గా ఉంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,210 వద్ద కొనసాగుతోంది.
  • ఇక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,52,960 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,52,950గా ఉంది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,210గా ఉండగా.. నిన్న రూ.1,40,200గా ఉంది.
  • అటు చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,280గా ఉండగా.. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,510 వద్ద ట్రేడవుతుండగా..
  • ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,53,110 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,360 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు ఇలా

ఇక వెండి విషయానికి వస్తే ఇది కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ వెండి ధర కేజీపై రూ.100 పెరిగింది. దీంతో బుధవారం రూ.2,55,000గా ఉండగా గురువారం ఈ ధర రూ.2,55,100 వద్ద ట్రేడవుతుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,65,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *