బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. ధరలు గంటల వ్యవధిలోనే భారీగా తగ్గుదల నమోదు చేశాయి. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అలాగే బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడింది. గురువారం బంగారం రేట్లు క్రాష్ అవ్వగా.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,480 వద్ద కొనసాగుతోంది. బుధవారం ఆ ధర రూ.1,53,820 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2340 తగ్గిపోయింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,850గా ఉండగా.. నిన్న రూ.1,41,000 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2150 పడిపోయింది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,730 వద్ద ఉండగా.. బుధవారం రూ.1,54,910గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.2180 డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల ధర ఇప్పుడు రూ.1,40,000గా ఉండగా.. నిన్న రూ.1,42,000గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.2 వేలు తగ్గిందని చెప్పవచ్చు.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,51,630 వద్ద ఉండగా.. నిన్న రూ.1,53,970గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,000గా ఉంది. నిన్న ఇది రూ.1,41,150 వద్ద స్ధిరపడింది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,51,480 వద్ద ఉండగా.. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,38,850 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు కూడా పడిపోయాయి. బెంగళూరులో కేజీ వెండి రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.60 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.65 లక్షల వద్ద స్ధిరపడింది.





