Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూమ్‌లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్న పడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలపు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
