తాజావార్తలు

EPF Withdrawal కోసం కొత్త మొబైల్ యాప్ – 3

EPF Withdrawal కోసం కొత్త మొబైల్ యాప్ – 3 రోజుల్లో బ్యాంక్ ఖాతాలో డబ్బు, UPI సౌకర్యం!

PF డబ్బు విత్‌డ్రా కోసం కొత్త మొబైల్ యాప్ – 3 రోజుల్లోనే బ్యాంక్ ఖాతాలో డబ్బు!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:
భవిష్య నిధి (EPF) సభ్యులకు త్వరలో మరింత సులభమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. https://epfbalancestatus.co.in/epf-office/ఉద్యోగుల పీఎఫ్‌ డబ్బును త్వరగా విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్‌ఓ (EPFO) ప్రత్యేకంగా కొత్త మొబైల్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా యూపీఐ విధానంలో నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేసుకునే అవకాశం కలుగుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త యాప్‌ను వచ్చే ఏప్రిల్ నెలలో అధికారికంగా ఆవిష్కరించాలని భావిస్తోంది. ఇప్పటికే యూఏఎన్ (UAN), ఉమాంగ్ (UMANG) యాప్‌ల ద్వారా పీఎఫ్ ఖాతా వివరాలను తెలుసుకునే సౌకర్యం ఉన్నప్పటికీ, ఈ కొత్త యాప్ ద్వారా విత్‌డ్రా ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

3 రోజుల్లోనే డబ్బు జమ

ఈ యాప్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా కోసం దరఖాస్తు చేస్తే, కేవలం మూడు రోజుల్లోనే సొమ్ము నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమయ్యే అవకాశం ఉంది. అయితే, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే పరిమితి విధించనున్నారు.

ఈ కొత్త డిజిటల్ సేవలతో ఉద్యోగులకు పీఎఫ్‌ సంబంధిత ప్రక్రియలు మరింత సులభం, వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *