తాజావార్తలు

“అంతరిక్షంలో Deta Centers…Elon Musk జోస్యం!”

“అంతరిక్షంలో Deta Centers…Elon Musk జోస్యం!”

Elon Musk

Elon Musk  సంచలన జోస్యం: మూడేళ్లలో అంతరిక్షంలో Deta Centers ఏర్పాటు!

ఎలాన్ మస్క్ సంచలన జోస్యం: మూడేళ్లలో అంతరిక్షంలో డేటా సెంటర్లు!

ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమిపై కంటే అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు సులభమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాబోయే మూడు సంవత్సరాల్లో అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు వేగంగా పెరుగుతుందని అంచనా వేశారు.

డేటా సెంటర్ల నిర్వహణకు భూమిపై భారీ ఖర్చులు, విద్యుత్ వినియోగం, శీతలీకరణ సమస్యలు ఎదురవుతున్నాయని మస్క్ పేర్కొన్నారు.

అంతరిక్షంలో అయితే సహజంగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల కూలింగ్ సమస్యలు తక్కువగా ఉంటాయని, అలాగే సౌర శక్తిని విస్తృతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

భవిష్యత్తులో అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇంటర్నెట్ సేవలు మరింత వేగవంతమవుతాయని, గ్లోబల్ డేటా నిల్వకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రకటనతో ప్రపంచ టెక్ రంగంలో అంతరిక్ష డేటా సెంటర్లపై చర్చలు ప్రారంభమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *