సక్సెస్ ఫార్ములాలు -o2 సక్సెస్ ఫార్ములాలు -o2
ఇతరుల గురించి గాసిప్ లు వదలకండింది
ఇవాళా, రేపూ అసలు విషయాల కంటే పుకార్లే ముందుంటున్నాయి. “గురూ వాడొక వెధవ. మొన్న ఎవరో అమ్మాయితో మోటారు సైకిల్ మీద కన్పించాడు” అనో, ‘గురూ! ఆ ఏరియాలో ఇల్లు కొంటున్నావట కదా! అమ్మో, అక్కడ ఫలానా రౌడి ఆధిపత్యం వుందట’ అనో తెలిసి తెలియని విధంగా మాట్లాడుతారు.

తీరా అసలు విషయం ఏమిటంటే అమ్మాయి ఎవరో కాదు, అతడి చెల్లెలు (పిన్ని కూతురు).
అలాగే, ఆ ఏరియాలో ఇల్లు కొనడం కాస్తా వదిలేసుకున్నాక తెలిసిందేమిటంటే – అక్కడ ఏ రౌడి లేడు.
దాంతో బంగారంలాంటి ఇల్లు వదిలేసినందుకు బాధపడ్డాడు అతడు.
కడివెడు పాలలో చుక్క విషం పడితే పాలు ఎలా విరిగిపోతాయో అలా గాసిప్స్ వల్ల జీవితాలే నాశనం అవుతాయి.
అసలు విషయం కంటే గాసిప్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. ఏమీ (పొగ) లేకుండా నిప్పుని సైతం రాజేయగలరు ఇంకొంతమంది.
ఈ గాసిప్స్ ఫలితంగా హృదయాలు బద్దలవుతాయి. ద్వేషాలు, కోపాగ్నులు రగిలిపోతాయి.
అది పెళ్ళిళ్ళని, భవిష్యత్లను చెడగొట్టగలదు. ప్రభుత్వాలనే పడగొట్టగలదు.
ఇటీవల అమెరికా, ఇరాక్ మీద దాడి చేయడానికి కారణం ఇలాంటి గాసిప్లో. అమెరికా ప్రెసిడెంట్ సలహాదారులలో ఒకరు ఇచ్చిన సలహా ప్రకారమే అమెరికా ఇరాక్ మీద దాడికి సమాయత్తమయింది. ఫలితంగా ఎంతోమంది అమాయక ప్రజలు బలయ్యారు.
నిజానికి ఈ గాసిప్లను సృష్టించేవాడే కాక ప్రోత్సహించేవాడు, వినేవాడు సైతం దోషి క్రింద లెక్క.

మీరు విజయం సాధించాలంటే ఇలాంటి గాసిప్లను అసలు పట్టించుకోవద్దు.
నిజంగా గమ్యం కోసం కష్టపడేవాడికి అసలు గాసిప్లను వినే ఆసక్తి, తీరికా రెండూ వుండవు.
అక్క ఒకటి గుర్తుంచుకోండి ఇతరుల గురించి మనకు చెడుగా చెప్పేవారు, మన గురించి కూడా ఇతరులకు చెడుగానే చెబుతారు.
ఒక వేళ గాసిప్ మీ దృష్టికి వస్తే ‘అందులో నిజముందా? అసలు అతడు / ఆమె అలా చేస్తారా?’
ఇంకెవరికి చెప్పకుండా మీలో మీరు ఆలోచించి దాని మీద సహేతమైన నిర్ణయం తీసుకోండి.

అంతేకాక గాసిప్స్ వెదజల్లే వాడికి దూరంగా వుండండి.
అలాంటి వారికోసం మీ సమయం ఖర్చుచేయకండి.

