తాజావార్తలు

Cinema : కారులో శవంతో ప్రయాణం.. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్.. ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ డ్రామా..

Cinema : కారులో శవంతో ప్రయాణం.. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్.. ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ డ్రామా..


Cinema : కారులో శవంతో ప్రయాణం.. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లింగ్.. ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ డ్రామా..

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. ప్రతి శుక్రవారం డిజిటల్ ప్లాట్ పామ్ లోకి కొత్త కొత్త కంటెంట్ చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ చిత్రాలకు రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే పలు చిత్రాలు, వెబ్ సిరీస్ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ క్రైమ్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా.. ఇప్పుడు డిజిటల్ మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయనుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఏప్రిల్ 3 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో శివాజీ, లయ కలిసి నటించిన సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఈ చిత్రాన్ని మార్చి 6న థియేటర్లలో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా వెండితెరపై అలరించిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇందులో శివాజీ, లయతోపాటు రోహన్, శరత్ లోహితాశ్వ, అలీ, ధన్ రాజ్, ప్రిన్స్, ఇమ్మాన్యుయేల్ కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

కథ విషయానికి వస్తే.. ఒక కుటుంబం శవాన్ని మాయం చేయాలనుకుంటుంది. శ్రీరామ్ (శివాజీ) పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తుంటాడు. అతడు నిజాయితీపరుడు. లంచం తీసుకోడు. అతడి భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్). ఒకసారి శ్రీరామ్ తో ఎస్సై విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్ )కు గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే శ్రీరామ్ ఇంట్లో లేని సమయంలో ఉత్తరపై ప్రిన్స్ దాడికి ప్రయత్నిస్తాడు. అప్పుడే వాసుదేవ్ ను అనుకోకుండా బిట్టు చంపేస్తాడు. ఇక ఆ తర్వాత అతడి శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేస్తుంది శ్రీరామ్ ఫ్యామిలీ. వాసుదేవ్ శవాన్ని కారులో పెట్టుకుని ఎలాగైనా మాయం చేయాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే అతడి ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : Puri Jagannadh : బద్రి సినిమాలో యాక్టింగ్.. ఆ నటికి ప్రతి నెల డబ్బులు పంపుతున్న పూరి.. కారణం ఇదే..

ఎక్కువ మంది చదివినవి : Prakash Raj : క్రైస్తవ సంప్రదాయంలో తల్లి అంత్యక్రియలు.. ట్రోల్స్ పై మండిపడ్డ ప్రకాష్ రాజ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *