తాజావార్తలు

Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..


Cinema : ప్రతీకారంతో రగిలే ప్రేయసి కథ.. ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O’ Romeo). ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. థియేటర్లలో మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10, 2026 నుండి స్ట్రీమింగ్ చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం 1994 నాటి ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతుంది. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

షాహిద్ కపూర్ ఇందులో ‘ఉస్తారా’ అనే శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, త్రిప్తి దిమ్రి ‘అఫ్షాన్’ అనే పాత్రలో నటించింది. కేవలం గ్యాంగ్‌స్టర్ డ్రామా మాత్రమే కాకుండా, ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల పాత్రలు, మాఫియా నెట్‌వర్క్, ఒక బలమైన ప్రేమకథను దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమాలో తమన్నా భాటియా, దిశా పటానీ, నానా పాటేకర్, అవినాష్ తివారీ , ఫరీదా జలాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటించారు. సాజిద్ నడియాడ్‌వాలా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రావడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

విశాల్ భరద్వాజ్ మార్కు ‘నోయిర్’ ఎలిమెంట్స్, దిగ్గజం గుల్జార్ అందించిన సంగీతం, సాహిత్యం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అధికార దాహం, పగ, ప్రతీకారం, ప్రేమ చుట్టూ తిరిగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

 

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *