తాజావార్తలు

Chiranjeevi: హనుమాన్ జయంతి రోజున చిరంజీవి ఇంట్లో అద్భుతం.. స్వయంగా వీడియో షేర్ చేసిన మెగాస్టార్

Chiranjeevi: హనుమాన్ జయంతి రోజున చిరంజీవి ఇంట్లో అద్భుతం.. స్వయంగా వీడియో షేర్ చేసిన మెగాస్టార్


Chiranjeevi: హనుమాన్ జయంతి రోజున చిరంజీవి ఇంట్లో అద్భుతం.. స్వయంగా వీడియో షేర్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుడు. తన ప్రతి పనిలోనూ హనుమంతుడి ఆశీస్సులు ఉంటాయని ఆయన బలంగా నమ్ముతుంటారు. చిరంజీవి మాతృమూర్తి పేరు అంజనా దేవి కాగా, తన ఇంటికి ఏకంగా అంజనాద్రి అని పేరు పెట్టుకున్నారు మెగాస్టార్ ఇదిలా ఉంటే ఇవాళ (ఏప్రిల్ 02) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా అందరూ సోషల్ మీడియా వేదికగా హనుమంతుడికి సంబంధించి ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకొంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రత్యేక వీడియోను ఎక్స్ (ట్విట్టర్) అభిమానులతో పంచుకున్నారు. తన ఇంటిలోని పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యాన్ని ఈ వీడియోలో చూపించిన చిరంజీవి.. ‘ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.

 

‘హనుమాన్‌ జయంతి సందర్భంగా మా పూజా మందిరంలో జరిగిన ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. ప్రతి సంవత్సరం డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకాంతి పడి మెరిసిన అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్‌, అరసవల్లి దేవాలయాల్లో కూడా సూర్య కిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందే. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ జరిగింది. ఆ సూర్య భగవానుడు ఆంజనేయుడిని స్పృశించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా’అని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్.

మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన వీడియో ఇదిగో..

చిరంజీవి శ్రీరామనవమి పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *