తాజావార్తలు

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం


సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్ సర్వీస్ ఉందని సిబ్బంది చెప్పడంతో, తమకు టీ సర్వ్ చేయడం లేదని ఆగ్రహం చెందిన నలుగురు యువకులు నిర్వాహకులతో గొడవకు దిగారు, ఇదే క్రమంలో తమ స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో మరికొంతమంది యువకులు అక్కడికి చేరుకొని విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. హోటల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేసి, తిను బండారాలను నేలపై విసిరికొట్టారు. వీధి రౌడీల్లా దాడులు చేస్తుండడంతో వినియోగదారులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీసారు. నిర్వాహకులపై భౌతికంగా దాడులు చేసిన వీడియో సిసి కెమెరాలో రికార్డు అయింది..బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్, కారు రిజిస్ట్రేషన్స్‌ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు

8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత

రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్

ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా

బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *