ఏపీ బడ్జెట్లో దివ్యాంగులకు ప్రభుత్వం తియ్యని కబురు అందించింది. ఏపీ రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘ఇంద్రధనుస్సు’ పేరుతో ప్రకటించిన ఏడు ముఖ్య సంక్షేమ పథకాలలో భాగంగా, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు 100 శాతం ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న 50 శాతం రాయితీ విధానాన్ని నిలిపివేసి, మహిళలకు అమలు చేస్తున్న విధానంలాగే దివ్యాంగులకు కూడా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల వరకు పూర్తిస్థాయి ఉచిత ప్రయాణం అందించనున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది దివ్యాంగులకు ప్రయాణ సౌకర్యంలో పెద్ద ఊరటగా మారనుంది.
దాదాపు 7.6 లక్షల మందికి దీనివల్ల లబ్ది చేకూరనుంది.


