తాజావార్తలు

Allu Sirish Haldi: అల్లు వారి హల్దీ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన

Allu Sirish Haldi: అల్లు వారి హల్దీ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన


అల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ అయ్యింది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇదివరకే అల్లు శిరీష్, నయనిక తమ స్నేహితులకు దుబాయిలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా అల్లు శిరీష్ ఇంట్లో పసుపు దంచే వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అల్లు మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి పసుపును దంచారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతోపాటు తన కుమార్తె సుస్మిత, కోడలు ఉపాసన, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా.. స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు శిరీషే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అల్లు శిరీష్ కు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు శిరీష్ హల్దీ వేడుక కార్యక్రమంలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. జనవరి 31వ తేదీన ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 12న తమ కవల పిల్లలకు బారాసాల కూడా నిర్వహించారు. కూతురికి అన్వీరా దేవి కొణిదెల అని, కుమారుడికి శివ్ రామ్ కొణిదెల అని నామకరణం చేశారు. ఈ క్రమంలో డెలివరీ తర్వాత మొదటి సారి ఉపాసన ఈ వేడుకలో కనిపించింది. ఇక అల్లు శిరీష్ పెళ్లి మార్చి 6వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. డేట్ అయితే ఫిక్స్ అయ్యింది కానీ వేదిక వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నట్టు సమాచారం. త్వరలోన అల్లు శిరీష్ పెళ్లి వేడుకకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు.. డార్లింగ్ బ్యూటిఫుల్ రివ్యూ..

Trisha: తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం

Prabhas: షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ కింద పడ్డ ప్రభాస్‌

Chiranjeevi: చిరుకు సర్జరీ ?? ఆందోళనలో ఫ్యాన్స్

Kova Bun Ali: కోవా బన్‌ వలికి.. మెగా సపోర్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *