Acupuncture - ఆక్యుపంక్చర్

సూది వైద్యం…
జ్వరంతో వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు.. సూది వేస్తామనగానే.. కాళ్లలో వణుకు పుడుతుంది చాలామందికి. ఒక చిన్న సూదికే అలా భయపడితే.. ఇక ఒళ్లంతా సూదులతో గుచ్చే వైద్యం అంటే భయమేస్తుంది కదూ? ఆక్యుపంక్చర్ అనగానే ఒంటిమీద గుచ్చిన సూదులు గుర్తుకు వస్తాయి. ఈ వైద్యవిధానంపై అవగాహన లేనివాళ్లు మాత్రమే భయపడతారు. చిన్న చీమకుట్టినట్లు కూడా అనిపించని ఈ వైద్యాన్ని ఎవరైనా చేయించుకోవచ్చు. ఇందులో ఎలాంటి భరించలేని నొప్పి ఉండదు. అస్సలు భయపడాల్సిన పని లేదు. సూదివైద్యంతో.... సూదివైద్యంతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఈనాటిది కాదు, ఎనిమిది వేల ఏళ్ల నుంచి ప్రపంచం ఆమోదిస్తూ వస్తున్న విలువైన, అరుదైన వైద్యం.ఆక్యుపంక్చర్ అతి పురాతనమైన వైద్య విధానం. శరీరంలో పలు 'చోట్ల జీవశక్తిని పంపించే (శక్తి ప్రసారాలు) మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. వాటిని ఉత్తేజితం చేయడం ద్వారా మళ్లీ ప్రాణ శక్తి తిరిగి వస్తుంది. శరీరంలోకి ప్రాణశక్తి నిరంతరం ప్రవహిస్తుంటుంది. దీనినే బయో మాగ్నటిక్స్ వేవ్స్ అంటారు. ఇవి సూర్యరశ్మి నుంచి శక్తిని పొందుతాయి. శక్తిని పొందిన మెరీడియన్స్ దేహంలోని ఏడు చక్రాలను ఉత్తేజితం చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి జీవశక్తిని అన్ని అవయవాలకు పంపించే ట్రాన్స్ఫార్మర్ల వంటివన్నమాట. అక్కడి నుంచి నాడీవ్యవస్థలోని నాడులు, రక్తనాళాలు, డీఎన్ఏ కణాలు వంటివన్నీ ప్రాణశక్తిని పొందుతాయి. తద్వార శరీరం ఉత్తేజితంగా, చురుగ్గా మారుతుంది. మానవ మెదడు రసాయన సమ్మేళనం. అవయవాలకు కావాల్సిన రసాయనాలను విడుదల చేస్తుంటుంది మెదడు. ఆ ప్రక్రియ దెబ్బతింటే రోగాలు వస్తాయి. అదే కనక శరీరంలోని మెరిడియన్స్ చురుగ్గా ఉంటే... మెదడుకు సులువుగా ప్రాణశక్తి అందుతుంది. ఆక్యుపంక్చర్ ఏంచేస్తుందంటే.. ఎక్కడైతే ప్రాణశక్తికి అడ్డు ఏర్పడిందో అక్కడ సూదుల ద్వారా గుచ్చి, అడ్డంకులను తొలగిస్తారు. దాంతో ప్రాణశక్తి సులభంగా శరీరమంతా చేరుతుంది. ఎప్పుడైతే నాడీవ్యవస్థ చురుగ్గా మారి, రక్తసరఫరా సాఫీగా సాగి, ప్రాణశక్తి సరఫరా అవుతుందో... అప్పుడు అన్ని అవయవాలకు తగిన ఆక్సిజన్ కూడా అందుతుంది. మనకు మనం తెలియకుండానే ఉత్తేజితం అవుతాం. అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే... అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లనొప్పులు పోతాయి. అన్ని రోగాలకు పరిష్కారం లభిస్తుంది. ఆక్యుపంక్చర్లో ప్రధానంగా నాడీ పరీక్ష చేస్తారు. ఒక అనుభవజ్ఞుడైన ఆక్యుపంక్చర్ వైద్యుడు రోగి నాడి పట్టి చూస్తే.. ఆ నాడి కొట్టుకునే తీరును బట్టి.. ఏ అవయవం బలహీనంగా ఉంది? ఎక్కడ ఆనారోగ్యం తలెత్తింది? అర్థం చేసుకోగలడు.దాన్ని బట్టి కూడా వైద్యం ఉంటుంది. ఇందులో ఎలాంటి భరించలేని నొప్పి ఉండదు. అస్సలు భయపడాల్సిన పని లేదు. ఆక్యుపంక్చర్ రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించింది. అక్కస్, పంక్చుర ఆ పదాలు. అక్కస్ అంటే పదునైన మొనతేలిన వస్తువు అనర్థం. పంక్చుర అంటే గుచ్చడం అనర్థం. ఒక పదునైన సూదిలాంటి వస్తువుతో శరీరంపై గుచ్చి, చేసే.....సూదివైద్యం..ద్యాన్నే అక్యుపంక్చర్ అంటారు. అయితే ... అయితే శరీరంలో ఎక్కడ పడితే అక్కడ గుచ్చరు. జీవశక్తి లేదా ప్రాణశక్తి ప్రేరేపిత ప్రదేశాలలో మాత్రమే గుచ్చడం ఈ వైద్య లక్షణం. ఈ వైద్య విధానం చైనాలో ప్రాచుర్యం పొందింది. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన తరువాత అక్కడి ప్రాచీన వైద్యవిధానమైన ఆక్యుపంక్చర్ను అభివృద్ధి చేశాడు మావో... మావో అలోపతి వైద్యవిధానం కంటే ప్రాచీన, సంప్రదాయ వైద్య విధానాలే మేలన్నది ఆయన విశ్వాసం. సుమారు ఎనిమిది వేల సంవత్సరాల నుంచి వస్తున్న వైద్యం ఇది. కాలపరీక్షకు నిలబడింది ఆక్యుపంక్చర్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ సూదుల చికిత్స చేసుకోవచ్చు. శరీరంలోని శక్తి ప్రసార మార్గాల వద్ద సూదులను గుచ్చుతారు. దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు. సైడ్ఫైక్ట్స్ రావు. ఆ సూదులు శరీరానికి హాని చేయవు. ఇవి స్టెరిలైడ్ నూడిల్స్. వీటిని వైద్యులు రక్తనాళాల మీద గుచ్చరు. కాబట్టి నరాలు, రక్తనాళాలు దెబ్బతినే అవకాశమే ఉండదు. సూదులు కేవలం చర్మపు పైపొర (ఎపిడెర్మా) మీద మాత్రమే గుచ్చుతారు. ఒక వ్యక్తికి వాడిన సూదులను మరొకరికి వాడరు. అందరికీ ఒకే సంఖ్యలో సూదులను గుచ్చరు. చివరిగా... ఆరోగ్య సమస్యను బట్టి సూదులను వాడతారు. మానవ దేహంలో అత్యధిక ఆక్యుపంక్చర్ పాయింట్లు కేవలం మోచేతుల నుంచి అరచేతుల వరకు.. మోకాళ్ల నుంచి అరికాళ్ల వరకు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రదేశాలలోనే ఎక్కువ సూదులు వాడతారు. ఆ భాగాలు చాలా సురక్షితమైన ప్రదేశాలు. కాబట్టి ఎలాంటి భయాలు అక్కర్లేదు. అయితే చికిత్స తీసుకునేవారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. ఆక్యుపంక్చర్ వైద్యం చేయించుకునే వైద్యులు అర్హత పొందినవారై ఉండాలి. అనుభవం తప్పనిసరి. https://youtu.be/tXrLVb9sIlI?si=aWUPZJJQ9bEgeXx0

సునాయాసంగా చేసే సూది వైద్యం…
