తాజావార్తలు

మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో

మీరు ఫుల్‌బాల్ ఆడతారా.. మీకోసమే హైదరాబాద్‌‌లో టీవీ9 టాలెంట్ హంట్ ప్రోగ్రాం.. పూర్తి వివరాలు ఇవిగో


Indian Tigers and Tigresse: టీవీ9 (News9) ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెసెస్ సీజన్ 2 సెలక్షన్స్ హైదరాబాద్ చేరుకుంది . శ్రీనిధి డెక్కన్ ఫుట్ బాల్ క్లబ్ సమక్షంలో హైదరాబాద్లో టైగర్స్ అండ్ ట్రాగ్రసస్ సీజన్ 2 సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అండర్ 14, అండర్ 17 కు సంబంధించిన పిల్లల ఆట తీరును పరిశీలించారు శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ కోచ్ బృందం. వీరీ నుంచి సీజన్ 2కి సెలెక్ట్ కాబోయే 30 మంది ప్రాబబుల్స్ లో హైదరాబాద్ నుంచి కూడా ఎంపిక చేయనున్నారు.

దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారులను గుర్తించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడం టీవీ9 నెట్వర్క్ చేస్తున్న ఈ హాంటింగ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

దేశ వ్యాప్తంగా చాలా నగరాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా వందలాది మంది యువ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే మొదటి సీజన్‌లో 12 మంది బాలికలు, 16 మంది బాలురు ఆస్ట్రియా, జర్మనీ దేశాల్లో శిక్షణ పొందే అవకాశం పొందారు.

ఈ సీజన్ 2 లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 30 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ హంటింగ్ కార్యక్రమం ద్వారా పిల్లల్లోని ఫుట్బాల్ ఆటం నైపుణ్యం వెతికి తీయడమే కాకుండా వారికి మంచి అవకాశం కల్పించి ప్రపంచ స్థాయి ట్రైనింగ్ తో పాటు గుర్తింపు కూడా ఇస్తున్నందుకు టీవీ9 నెట్వర్క్ కు పేరెంట్స్ థాంక్యూ చెబుతున్నారు. సో చూడాలి ఈ సెషన్ లో హైదరాబాద్ నుంచి ఎంతమంది పిల్లలు సెలక్ట్ అవుతారో.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *