తాజావార్తలు

సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్లు..! ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!

సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్లు..! ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!


సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు ప్రశాంతంగా తిరిగి హైదరాబాద్‌ నగరానికి వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం – చర్లపల్లి – విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలు వెల్లడించింది.

  • 08517 విశాఖపట్నం టు చర్లపల్లి ఆదివారం (18.01.2026) మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7:30 గంటలకు చేరుకుంటుంది.
  • 08518 చర్లపల్లి టు విశాఖపట్నం సోమవారం (19.01.2026) ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 12.30 గంటలకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైలులో 2AC, 3AC స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో స్టాపింగ్‌ ఏర్పాటుకు రైల్వే శాఖ ఆమెదం..!

సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ప్రయోగాత్మక స్టాపింగ్ ఏర్పాటుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైలు నంబర్ 12626/12625 న్యూఢిల్లీ– తిరువనంతపురం సెంట్రల్ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రైల్వే స్టేషన్ జనవరి 17, 2026 నుండి అమలులోకి వస్తుంది. రైలు నంబర్ 12626 / 12625 న్యూఢిల్లీ – తిరువనంతపురం సెంట్రల్ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్‌నగర్‌లో రాక / బయలుదేరే సమయాలు 17.01.2026 నుండి అమలులోకి వస్తాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *