
చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న మంచి అలవాట్లలో నిద్రలేవగానే పక్కబట్టలు సర్దడం ఒకటి. అయితే, తాజా ఆరోగ్య పరిశోధనలు దీనికి భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. లేవగానే బెడ్ సర్దడం వల్ల మనకే తెలియకుండా కొన్ని ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం నుండి సహజంగానే కొంత చెమట, చర్మ కణాలు వెలువడతాయి. ఇవి పక్కబట్టలపై (Bed sheets and blankets) పేరుకుపోతాయి. ఈ తేమ డస్ట్ మైట్స్ అనే సూక్ష్మజీవులకు ప్రధాన ఆహారం. మనం లేవగానే దుప్పట్లు మడతపెట్టేస్తే, ఆ తేమ లోపలే ఉండిపోతుంది. దీనివల్ల డస్ట్ మైట్స్ వేగంగా వృద్ధి చెంది మన పక్కబట్టలను ఒక బ్యాక్టీరియా కేంద్రంగా మారుస్తాయి.
మనం నిద్రలేచిన తర్వాత దుప్పట్లను అలాగే వదిలేయడం వల్ల (Unmaking the bed), గదిలోని గాలి, వెలుతురు ఆ పక్కబట్టలకు తగులుతాయి. గాలి తగలడం వల్ల దుప్పట్లలోని తేమ ఆరిపోతుంది. డస్ట్ మైట్స్ బతకడానికి తేమ అవసరం. పొడి వాతావరణంలో అవి జీవించలేవు. ఇలా చేయడం వల్ల తుమ్ములు, జలుబు, చర్మంపై వచ్చే దద్దుర్లు తగ్గుతాయి.
నిద్రలేవగానే గది కిటికీలు తెరిచి తాజా గాలి లోపలికి వచ్చేలా చూడండి. మీరు తయారైన తర్వాత లేదా బ్రేక్‌ఫాస్ట్ ముగించిన తర్వాత బెడ్ సర్దడం అలవాటు చేసుకోండి. బెడ్ షీట్లను వారానికి ఒకసారి వేడి నీటితో ఉతకడం వల్ల మరింత రక్షణ లభిస్తుంది. నీట్‌గా ఉండటం ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ముఖ్యం. రేపటి నుండి నిద్రలేవగానే మీ బెడ్‌కు కొంచెం గాలిని, వెలుతురును ఇవ్వండి. ఆ తర్వాతే దాన్ని అందంగా సర్దుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
