
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎదో ఒక సమయంలో, ఎదో ఒక విషయంలో డిప్రషన్ ఎదుర్కొన్నవారే.. చాలా మంది డిప్రషన్ కారణంగా సినిమాలు దూరం కూడా అయ్యారు. కొంతమంది హీరోయిన్స్ డిప్రషన్ కారణంగా ప్రాణాలు కూడా తీసుకున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు హీరోలు కూడా మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు తీసుకున్నారు. తెలుగులో ఉదయ్ కిరణ్, బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మానసిక ఒత్తిడి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక కొంతమంది మాత్రం మద్యానికి బానిసలు అవ్వడం వంటివి కూడా జరిగాయి. తాజాగా ఓ స్టార్ హీరో తాను కూడా మద్యానికి బానిసయ్యా అని తెలిపాడు. ఓ సంఘటన తన గుండెలను బద్దలు కొట్టిందని.. దాన్ని తట్టుకోలేక మద్యానికి బానిసయ్యా అని తెలిపాడు.
జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట
ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో , మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. ఈ స్టార్ హీరో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తాజాగా అమీర్ ఖాన్ తన జీవితంలో ఎదురైన ఓ షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. ఒకానొక సమయంలో ఎంతో మనో వేదనకు గురయ్యాను.. మద్యానికి బానిసయ్యా అని తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తన మొదటి భార్య రీనా దత్ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎంతో బాధపడ్డానని.. భరించలేని మనో వేదనకు గురయ్యా అని తెలిపాడు.
వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!
రీనా వెళ్ళిపోయినప్పుడు నా గుండె ముక్కలైంది. ఆ బాధను ఎలా ఎదుర్కోవాలో తెలియక మద్యంకు బానిసయ్యా.. ప్రతి రోజు గంటల తరబడి మద్యం తాగేవాడిని..అని ఎమోషనల్ అయ్యారు అమీర్. అయితే ఆ బాధనుంచి త్వరగానే కోలుకున్న అని తెలిపాడు. నేను ఇలానే ఉంటే న పిల్లల భవిషత్తు ఏంటి అని ఆలోచించా..? నా పిల్లల కోసం నేను నిలబడాలి అని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నా.. ఆ క్షణమే మద్యం మానేశా.. ఆ తర్వాత అస్సలు మద్యం జోలికి వెళ్ళలేదు అని తెలిపాడు అమీర్ ఖాన్. ఆమిర్ ఖాన్, రీనా దత్తా 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
